మార్చి 2 నుండి 10వ తేదీ వరకు తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
మార్చి 2 నుండి 10వ తేదీ వరకు తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2020 ఫిబ్రవరి 29: తిరుమల తిరుపతి దేవస్థానములకు అనుబంధంగా ఉన్న తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో మార్చి 2 నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. మార్చి 1వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం రాత్రి
02-03-2020(సోమవారం) ధ్వజారోహణం హంసవాహనం,
03-03-2020(మంగళవారం) ముత్యపుపందిరి వాహనం హనుమంత వాహనం
04-03-2020(బుధవారం) కల్పవృక్ష వాహనం సింహ వాహనం
05-03-2020(గురువారం) తిరుచ్చి ఉత్సవం పెద్దశేష వాహనం
06-03-2020(శుక్రవారం) తిరుచ్చి ఉత్సవం గజవాహనం
07-03-2020(శనివారం) తిరుచ్చి ఉత్సవం సర్వభూపాల వాహనం, కల్యాణోత్సవం, గరుడ వాహనం
08-03-2020(ఆదివారం) రథోత్సవం ధూళి ఉత్సవం
09-03-2020(సోమవారం) సూర్యప్రభవాహనం చంద్రప్రభ వాహనం, పార్వేట ఉత్సవం,అశ్వ వాహనం
10-03-2020(మంగళవారం) వసంతోత్సవం, చక్రస్నానం ధ్వజావరోహణం
కాగా, మార్చి 7వ తేదీ రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. మార్చి 11వ తేదీ సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.