PEETHAPURAM BTUs FROM MARCH 2 TO 8 _ మార్చి 2 నుండి 8వ తేదీ వ‌ర‌కు పిఠాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ బ్ర‌హ్మోత్స‌వాలు

TIRUMALA TIRUPATI DEVASTHANAMS

PEETHAPURAM BTUs FROM MARCH 2 TO 8

TIRUPATI, 22 FEBRUARY 2023: The annual Brahmotsavams in TTD-run Sri Venkateswara Swamy temple at Peethapuram is scheduled between March 2-8.

Commencing with Mritsangrahanam on March 2, Ankurarpana will be performed on the same day evening. On March 3, Dhwajarohanam will be observed between 8am and 8.45am.

On the same day evening, Srivari Kalyanotsavam will be observed between 6pm and 9pm. On March 4, Garuda Seva will be observed in the evening while on March 5 and 6 Unjal sevas are performed. On March 7, Chakrasnanam will be performed between  10.30am and 11.15am while on the same day night Dhwajavarohanam will be observed. 

 
On March 8 Pushpayagam will be performed between 6pm and 8pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 2 నుండి 8వ తేదీ వ‌ర‌కు పిఠాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి, 22ఫిబ్రవరి 2023: కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 2 నుండి 8వ తేదీ వరకు వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. మార్చి 2న సాయంత్రం 6 గంట‌ల‌కు మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు.

మార్చి 3న ఉద‌యం 8 నుండి 8.45 గంట‌ల‌ వరకు ధ్వజారోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి. సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం నిర్వ‌హిస్తారు. మార్చి 4న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి గ‌రుడ వాహ‌న సేవ జ‌రుగ‌నుంది. మార్చి 5, 6వ తేదీల్లో సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల్‌సేవ చేప‌డ‌తారు. మార్చి 7న ఉద‌యం 10.30 నుండి 11.15 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం, సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ధ్వ‌జావ‌రోహ‌ణం నిర్వహించనున్నారు. మార్చి 8న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు పుష్పయాగం నిర్వ‌హిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.