KODANDARAMA SWAMY TEMPLE FETE _ మార్చి 20 నుండి 28వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు
TIRUPATI, 08 MARCH 2023: The annual Brahmotsavams in Sri Kodandarama Swamy temple in Tirupati are set to commence from March 20-28 with Ankurarpanam on March 19 and Koil Alwar Tirumanjanam on March 17.
Everyday there will be vahana sevas between 8am and 9.30am, again 7pm and 8.30pm.
TTD is making elaborate arrangements for the big fete.
మార్చి 20 నుండి 28వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 08 మార్చి 2023: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 20 నుండి 28వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.
ఇందులో భాగంగా మార్చి 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 19న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహించనున్నారు.
ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
అదేవిధంగా మార్చి 30 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరగనున్నాయి.
వాహనసేవల వివరాలు :
20-03-2023 ధ్వజారోహణం పెద్దశేష వాహనం
21-03-2023 చిన్నశేష వాహనం హంస వాహనం
22-03-2023 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం.
23-03-2023 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
24-03-2023 పల్లకీ ఉత్సవం గరుడ వాహనం
25-03-2023 హనుమంత వాహనం గజ వాహనం
26-03-2023 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
27-03-2023 రథోత్సవం అశ్వవాహనం
28-03-2023 చక్రస్నానం ధ్వజావరోహణం
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.