మార్చి 23వ తేది నుండి 27వ తేది వరకు సూర్య పూజ, తెప్పోత్సవాలు
మార్చి 23వ తేది నుండి 27వ తేది వరకు సూర్య పూజ, తెప్పోత్సవాలు
తిరుపతి మార్చి-7,2009 : నాగలాపురం నందు గల శ్రీవేదనారాయణస్వామి వారి ఆలయంలో మార్చి 23వ తేది నుండి 27వ తేది వరకు సూర్య పూజ, తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తి.తి.దే. ధర్మప్రచారపరిషత్ ఎస్.వి. సంగీత కళాశాల అధ్వర్యంలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తిరుమల తిరుపతి దేవస్థానముల శ్వేత నందు మార్చి 8వ తేదిన ఉదయం 10 గంటలకు అంతర్జాతీయ మహిళాదినోత్సవం నిర్వహిస్తారు. కర్నాటక రాష్ట్ర మాజీ గవర్నర్ డా|| వి.యస్. రమాదేవి గారి చేతుల మీదుగా ప్రప్రధమంగా 17 మంది మహిళా ఉద్యోగినులకు పురస్కారాలు అందజేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.