Inauguration of ARCHAKA TRAINING PROGRAMME FOR ARCHAKAS from KARANATAK State _ అర్చక విధానంపై దాదాపు 3000 మందికి శిక్షణ

Tirupati, 03 March 2009: In order to establish the National Institute of Temple Administration as well as extending SVETA Activities for the people from other states, necessary steps are being taken told Sri V.Seshadhri, Joint Executive Officer, TTDs. On Tuesday morning he has inaugurated the week-long training programme for the Archakas from Karnataka State.

Speaking on the occasion the Joint Executive Officer said that although TTDs providing good training for the archakas on Pooja Vidhanam from different parts of the Andhra Pradesh state, on the request of the other states we have started this training. He assured that the pooja system in the temples should be performed as per the sastras and traditions, once they take good training here. He also said the Government of Karnataka has requested the TTD to provide training for 700 archakas from their state. He requested the archakas to give their valuable feed back about the training in SVETA so as to do necessary changes.

Earlier  Sri V.Seshadhri inaugurated the programme by lighting the Lamp.

Sri Bhuman, Director SVETA, Dr. Vedantham Vishnu Bhattacharyulu, Co-ordinator of this programme, 45 archakas from Karnataka state have participated in this programme.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs, TIRUPATI

అర్చక విధానంపై దాదాపు 3000 మందికి శిక్షణ

తిరుపతి మార్చి-3, 2009 : గత సంవత్సర కాలంగా శ్వేత నందు జరుగుతున్న అర్చక విధానంపై పునశ్చరణ తరగతులలో దాదాపు 3000 మంది శిక్షణ తీసుకున్నారని తి.తి.దే జె.ఇ.ఓ శ్రీవి.శేషాద్రి అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక శ్వేతనందు కర్నాటక రాష్ట్రం నుండి విచ్చేసిన 45మంది అర్చకులకు పూజా విధానంపై పునశ్చరణ తరగతులను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలోని పలుదేవాలయాలలో పనిచేస్తున్న అర్చకులు పూజావిధానంపై పండితులు ఇచ్చే మంచి సలహాలను తీసుకొని ప్రతినిత్యం తాము చేస్తున్న పూజాకైంకర్యముల విషయంలో సరి క్రొత్త విషయాలను తెలుసుకుంటూ ఇతరులకు కూడా ఆదర్శ ప్రాయులు కావాలని చెప్పారు. మొదటిసారిగా రాష్ట్రేతర ప్రాంతాల నుండి వచ్చే అర్చకులకు పూజావిధానంపై శిక్షణ ఇవ్వడం ద్వారా శ్వేతలో జాతీయస్థాయి ఆలయ పాలనకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి వీలు పడుతున్నదని చెప్పారు.

శ్వేతడైరెక్టర్‌ శ్రీభూమన్‌ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలోనున్న అర్చకులకు, మత్స్యకారులకు, గిరిజనగొరవలుకు పూజావిధానంపై శిక్షణ ఇచ్చామని, మొదటిసారిగా కర్నాటకలోని అర్చకులకు శిక్షణ ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని, ఈ శిక్షణను అర్చకులు చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పారు. తితిదే ఆగమ సలహాదారు శ్రీవేదాంతం విష్ణుభట్టాచార్యులు మాట్లాడుతూ ఇప్పటికి అనేక ఆగమాలపై అర్చకులకు శిక్షణ ఇచ్చామని, ఎవ్వరికీ ఎటువంటి సందేహంవచ్చినా నివృత్తి చేస్తామని, ఈ శిక్షణను చక్కగా ఉపయోగించుకొని తమతమ ప్రాంతాలలోని ఆలయాలలోచక్కగా అర్చకత్వం నిర్వహిస్తూ భక్తులకు స్వామివారి కృప, ఆశీర్వాదాలను అందించాలని ఆయన వారిని కోరారు.

ఈ కార్యక్రమంలో కర్నాటక నుండి వచ్చిన 45 మంది అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.