మార్చి 27వ తేది నాడు ”శ్వేత” లో ”భాషా పురస్కారాలు”
మార్చి 27వ తేది నాడు ”శ్వేత” లో ”భాషా పురస్కారాలు”
తిరుపతి మార్చి-26, 2009: తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులలో దిగువశ్రేణి, ఎగువశ్రేణి గుమాస్తాలు, పర్యవేక్షకులు మరియు ఇతర ఉద్యోగులకు ”భాషా పురస్కారాలు” మార్చి 27వ తేది ఉగాదినాడు ”శ్వేత” సభామందిరంలో ఉదయం 10.00 గంటలకు తితిదే కార్యనిర్వహణాధికారి చేతుల మీదుగా అందజేయబడతాయి.
దేవస్థానం పరిపాలనా కార్యవ్యవహారాలను తెలుగులో నిర్వహించడంలో అత్యంత నైపుణ్యం చూపించినవారికి ఈ పురస్కారాలు అందజేయబడతాయి. ప్రతి విభాగంలోనూ ముగ్గురిని ఎంపిక చేసి, మొత్తం 12 మందికి భాషా పురస్కారాలు, నగదు, జ్ఞాపిక, అభినందన పత్రం, శాలువ అందజేస్తారు. అలాగే తెలుగులో వక్తృత్వపోటీ, వ్యాసరచన పోటీ, విజేతలకు కూడా బహుమతులు అందజేస్తారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే సంగీత విభావరి ఉంటుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.