PHALGUNA LAKSHMI VAIBHAVAM AT TIRUPATI ON MARCH 28 _ మార్చి 28న తిరుపతిలో ఫాల్గుణ లక్ష్మీ వైభవం – లక్ష్మీ జయంతి
Tirupati, 26 Mar. 21: TTD is all set to organise the Phalguna Masa Lakshmi Vaibhavam on the auspicious occasion of Lakshmi Jayanti at Tirupati on March 28.
The program is scheduled between 6pm and 7.45 pm on Sunday and will be live telecast on the SVBC channel for the benefit of global devotees.
The dharmic programs held by TTD in form of Karthika, Dhanur, Magha utsavams earned tremendous adoration from devotees in the recent past.
The Phalguna utsavam will also be held on the same lines and the Lakshmi Jayanti celebrations included Veda Swasti, Lakshmi Jayanti significance, Mahalakshmi puja, Stotra Pathanam, Mahalakshmi Astakam Dance, Govinda Namavali, Deeparadhana and Mangala Harati.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మార్చి 28న తిరుపతిలో ఫాల్గుణ లక్ష్మీ వైభవం – లక్ష్మీ జయంతి
తిరుపతి, 2021 మార్చి 26: టిటిడి తలపెట్టిన ఫాల్గుణ మాస ఉత్సవాల్లో భాగంగా మార్చి 28వ తేదీన ఆదివారం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం పరేడ్ మైదానంలో ఫాల్గుణ లక్ష్మీ వైభవం – లక్ష్మీ జయంతి కార్యక్రమం జరుగనుంది. సాయంత్రం 6 నుండి రాత్రి 7.45 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
టిటిడి ఇప్పటివరకు నిర్వహించిన కార్తీక, ధనుర్, మాఘ మాస ఉత్సవాలకు భక్తుల నుండి విశేషాదరణ లభించింది. ఇదే తరహాలో ఫాల్గుణ మాస ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా వేదస్వస్తి, లక్ష్మీ జయంతి ప్రాశస్త్యం, మహాలక్ష్మీపూజ, స్తోత్ర పఠనం – మహాలక్ష్మీ అష్టకం, నృత్యం, గోవిందనామాలతో సామూహిక దీపారాధనం, మంగళహారతి నిర్వహిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.