ANNAMACHARYA VARDHANTI IN TIRUMALA ON MARCH 29 _ మార్చి 29న తిరుమ‌ల‌లో శ్రీ తాళ్లపాక అన్నమ‌య్య‌ 519వ వర్ధంతి

Tirumala, 28 March 2022: Saint Poet Sri Tallapaka Annamacharya 519th Vardhanti will be observed in Tirumala on March 29.

 

After Sahasra Deepalankara on Tuesday evening, the processional deities will reach Narayanagiri Gardens. Annamacharya Project artists will render Sankeertans.

 

Ahobila mutt seer will render Anugraha Bhashanam. This entire event will take place between 6pm and 8pm.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 29న తిరుమ‌ల‌లో శ్రీ తాళ్లపాక అన్నమ‌య్య‌ 519వ వర్ధంతి

తిరుమల, 2022 మార్చి 28: తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 519వ వర్ధంతి కార్యక్రమాలు మార్చి 29న మంగ‌ళ‌వారం సాయంత్రం తిరుమ‌ల‌లో జ‌రుగ‌నున్నాయి.

ఇందులో భాగంగా సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యం నుండి బ‌య‌ల్దేరి సాయంత్రం 6 గంట‌ల‌కు నారాయ‌ణగిరి ఉద్యాన‌వ‌నాల‌కు  వేంచేపు చేస్తారు. అనంత‌రం ప్రముఖ కళాకారులతో దిన‌ము ద్వాద‌శి సంకీర్త‌న‌లు, సప్తగిరి సంకీర్తనల  గోష్ఠిగానం నిర్వహిస్తారు. ఆ త‌రువాత అహోబిలం, శ్రీ‌ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి దేవ‌స్థానం 46వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తారు. చివ‌ర‌గా శ్రీ తాళ్ల‌పాక వంశీయుల‌కు స‌న్మాన కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.