ALL SET FOR WORLD WOMENS DAY CELEBRATIONS IN TTD_ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
\Tirupati, 7 March 2019: TTD has made all arrangements for grand celebrations of International Women’s .day at the Mahanti auditorium o Thursday, March 8.
As Dr D M Premavathi will render part of program keynote address in the morning, Head of. Telugu department of SRI Padmavathi Manila degree and PG College and Smt P Vasumati ASI of Tirupati.
As part of program, prominent women who have mark in society – Dr S Mallika Principal of Music College at Madurai and Smt Dhyuti Chand, an Olympic athlete of Odisha will be felicitated. Later winners of sports, music, and essay writing contests will be presented prizes after cultural display b TTD employees.
Similarly women employees of TTD likely to retire from March 2019 to February 2020 will also felicitated. TTD DyEO of welfare Smt Snehalata is supervising all arrangements
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
మార్చి 07, తిరుపతి, 2019: టిటిడి ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీ శుక్రవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఉదయం 10 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది. ముందుగా శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాల విశ్రాంత తెలుగు విభాగాధిపతి డా.. డిఎం.ప్రేమావతి, తిరుపతికి చెందిన ఏఎస్ఐ శ్రీమతి పి.సుమతి కీలకోపన్యాసం చేస్తారు. ఆ తరువాత టిటిడి ఉన్నతాధికారుల సందేశమిస్తారు. ఈ సందర్భంగా మధురైలోని రాణి లేడి మేయమ్మై ఆచ్చి తమిళ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ డా..ఎస్.మల్లిక, ఒడిశాలోని జాజ్‌పూర్‌కు చెందిన ఒలింపిక్ అథ్లెట్ శ్రీమతి ద్యుతి చంద్‌ను సన్మానిస్తారు. మధ్యాహ్నం మహిళా ఉద్యోగులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం క్రీడలు, సంగీతం, వ్యాసరచరన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేస్తారు. అదేవిధంగా, 2019 మార్చి నుండి 2020 ఫిబ్రవరి వరకు పదవీ విరమణ పొందనున్న మహిళా ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి ఆర్.స్నేహలత ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.