మార్చి18వ తేది నుండి 21వ తేది వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ

మార్చి18వ తేది నుండి 21వ తేది వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ

తిరుపతి మార్చి-11,2009 : తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమం మార్చి18వ తేది నుండి 21వ తేది వరకు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మార్చి 18వ తేదిన ఆచార్యరిత్విక్‌వరణం, వాస్తుహోమం, అంకురార్పణం, మార్చి 19వ తేదిన అకల్మషహోమం, అగ్మిప్రతిష్ఠ, కుంభస్థాపన, మార్చి 20వ తేదిన మహాశాంతి అభిషేకం, యాగశాలవైదిక కార్యక్రమాలు, మార్చి 21వ తేదిన ఉదయం 9గంటలకు పూర్ణాహుతి, ఉదయం 10.50గంటలకు కళావహన (వృషభలగ్నమందు), ఉదయం 11.30గంటలకు బ్రహ్మఘోష తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.