SRI PAT TEPPOTSAVAM CONCLUDES _ ముగిసిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు
Tiruchanoor, 5 Jun. 20: The five day float festival of Sri Padmavati temple at Tiruchanoor observed within the temple as per Covid 19 restrictions concluded on Friday.
On the final day Snapana Tirumanjanam was performed to the utsava idols of Sri Padmavati as per Agama traditions.
Dyeo Smt Jhansi Rani, AEO Sri Subramaniam and other officials participated.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ముగిసిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు
తిరుపతి, 2020 జూన్ 05: తిరుచానూరులో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. కోవిడ్-19 నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తున్న విషయం విదితమే.
ఇందులో భాగంగా మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల వరకుశ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం ఇతర సుగంధ ద్రవ్యాలతో ఉత్సవర్లకు అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.