MUTYAPUPANDIRI VAHANA SEVA _ ముత్యపుపందిరి వాహనంపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం 

TIRUPATI, 22 MARCH 2023: On the third day evening, Sri Kodandarama Rama accompanied by Sita Devi and Lakshmana Swamy took out a celestial ride on Mutyapupandiri Vahanam on Wednesday.

The annual brahmotsavams witnessed pearl carrier seva.

Both the senior and junior pontiffs of Tirumala, DyEO Smt Nagaratna, AEO Sri Mohan and other staffs, devotees were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ముత్యపుపందిరి వాహనంపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం
 
తిరుపతి, 2023 మార్చి 22: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం రాత్రి  ముత్యపుపందిరి వాహనంపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారు  భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటల నుండి వాహనసేవ వైభవంగా జరిగింది. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు.
   
వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ మోహన్, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌,  కంకణభట్టర్‌ శ్రీ ఆనందకుమార్‌ దీక్షితులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సురేష్, శ్రీ చలపతి, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.  
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.