GET READY WITH BOOKS ON DASA SAHITYA BY MAY-JEO _ మే చివరికి దాస సాహిత్య సంకీర్తనల గ్రంథాలు సిద్ధం చేయాలి- టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం
TIRUPATI, 30 MARCH 2022: The books with 500 Sankeertans of Dasa should get ready by this May end, said TTD JEO Sri Veerabrahmam.
Reviewing on the progress of works in his chambers in TTD Administrative building on Wednesday evening, the JEO directed the officials concerned that the translation works of 200 Sankeertans of Dasa Padas into Telugu should be completed by May-end. He said 50 Sankeertans should be recorded with versatile singers and shall be made popular among masses.
The JEO also directed to complete Linga Puranam printing works by June and Garuda Puranam by August.
He also instructed to take steps to translate 4000 Divya Prabandha Pasurams into Telugu soon.
He also reviewed on the conduct of the Managudi program in Chaitra and Vaisakha months by involving all projects to take forward the programmes at village level.
All Hindu Projects Program Officer Sri Vijayasaradhi, Dasa Sahitya Project Special Officer Sri Ananda Theerthacharyulu, Annamacharya Project Director Dr A Vibhishana Sharma, Publications Special Officer Sri Ramakrishna Sastry, TTD Press Special Officer Sri Ramaraju were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే చివరికి దాస సాహిత్య సంకీర్తనల గ్రంథాలు సిద్ధం చేయాలి- టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం
తిరుపతి 30 మార్చి 2022: దాస సాహిత్యానికి సంబంధించిన 500 సంకీర్తనలతో ముద్రించనున్న రెండు గ్రంథాలను మే నెలాఖరుకు సిద్ధం చేయాలని టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
టీటీడీ పరిపాలనా భవనం లోని తన చాంబర్లో బుధవారం సాయంత్రం ఆయన అన్ని హిందూ ధార్మిక ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ, కన్నడ నుంచి తెలుగులోకి 200 దాస సాహిత్య సంకీర్తనలను తర్జుమా చేసే కార్యక్రమం మే నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. దాస సాహిత్య అధ్యయనాలను దీర్ఘకాలికంగా వ్యవస్థీకృతం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చైత్ర వైశాఖ మాసాల్లో మనగుడి కార్యక్రమం నిర్వహణ కోసం ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా స్థాయిలో అన్ని హిందూ ధార్మిక ప్రాజెక్టుల కార్యక్రమాలను వ్యవస్థీకృతం చేసి గ్రామస్థాయిలో కార్యక్రమాల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.కొత్తగా 200 మంది ప్రబంధ పారాయణ దారులను తీసుకోవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. 4వేల దివ్య ప్రబంధ పాశురాలను తెలుగులో ముద్రించేందుకు చర్యలు ప్రారంభించాలని ఆయన చెప్పారు.
రాబోయే ఏడాదికి సంబంధించి అన్ని ప్రాజెక్టుల కార్యక్రమాల క్యాలెండర్ తయారు చేయాలన్నారు. ప్రతి మాసం ప్రముఖ సాధువుల జీవితాంశాలకు సంబంధించిన వ్యాసాలు సప్తగిరి మాసపత్రికలో ముద్రించాలన్నారు. 500 అన్నమాచార్య సంకీర్తనలకు ప్రతి పదార్థం, వ్యాఖ్యానంతో కూడిన గ్రంథాన్ని ఏప్రిల్ చివరినాటికి సిద్ధం చేయాలని చెప్పారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సాహిత్య సర్వస్వం ముద్రణ చేసి జనబాహుళ్యం లోకి తెచ్చేందుకు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. 280 అన్నమయ్య కొత్త సంకీర్తనలు రికార్డింగ్ చేయించి ప్రజలకు అందుబాటులోకి కావాలన్నారు. దాస సాహిత్యానికి సంబంధించిన 50 సంకీర్తనలు విద్వాంసులతో పాడించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే లా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లింగ పురాణం జూన్ చివరికి, గరుడ పురాణం ఆగస్టు నాటికి ముద్రణ పూర్తి చేయాలని చెప్పారు.
హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ విజయ సారధి, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ విభీషణ శర్మ, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి శ్రీ రామకృష్ణ శాస్త్రి, ముద్రణాలయం ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది