KOIL ALWAR TIRUMANJANAM IN NARAYAVANAM TEMPLE _ మే 15న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

Tirupati, 13 May 2024: In connection with the annual Brahmotsavam, Koil Alwar Tirumanjanam will be conducted at  Sri Padmavathi Sametha Kalyana Venkateswara Swamy Temple in Narayanavanam on May 15 from 6.30 am to 1 pm.  

The annual Brahmotsavam will be held from May 21 to 29.  

It is customary to conduct Koil Alwar Tirumanjanam before the Brahmotsavams.

In this, the premises of the temple, walls, roof, puja utensils etc. are cleansed with water.  

After that, holy water mixed with spices such as namakopu, Srichurnam, musk turmeric, pachchaku,  camphor, sandalwood powder, saffron, kichiligadda etc. called Parimalam will be smeared throughout the temple.  

Later, the devotees are allowed for darshan from 1:30pm onwards.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 15న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

తిరుపతి, 2024 మే 13: నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మే 15న ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. మే 21 నుండి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం మ‌ధ్యాహ్నం 1.30 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.