మే 16న తిరుమ‌ల‌లో సామూహిక ఉపనయనం

మే 16న తిరుమ‌ల‌లో సామూహిక ఉపనయనం

తిరుపతి, 2010 మే 13: తిరుమల తిరుపతి దేవస్థానములు, పురోహితసంఘం ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదిన అక్షయతృతీయ  పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఈ నెల 16వ తేదిన అక్షయతృతీయ సందర్భంగా తిరుమల పురోహిత సంఘం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక ఉపనయనాలు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచినవారు తమ పేర్లను ముందుగా పురోహిత సంఘం కార్యాలయంలో నమోదు చేసుకోవలెను. వివరాలకు క్రింది ఫోన్‌నెంబర్లను సంప్రదించండి. 98481 79757, 0877-2263460.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.