13th EDITION OF SUNDARAKANDA AKHANDA PARAYANAMS _ మే 2న ఆంజనేయస్వామివారు లంకా దహనం – రాక్షస సంహరం సర్గల పారాయణం
Tirumala, 1 May 2021: TTD is organising the 13th Edition of Sundarakanda Akhanda Parayanams on Sunday morning, May 2, including the significant sarga of Lanka Dahanu and Rakshasa Samhara at the Nada Niranjanam platform.
The unique program by TTD aimed at providing devotional and spiritual relief to humanity from pandemic Corona will be conducted under full Covid guidelines.
As part of the episode, the parayanams of 171 shlokas of 54-57 sargas of Sundarakanda will be held between at 7.00 am -9. 00 am.
Vedic pundits claim the parayanams of the significant sargas of Lanka Dana a and Rakshasa samhara will beget health and peace in a global society.
TTD has till date successfully conducted 12 phases of Akhanda Sundarakanda parayanams since the beginning of pandemic Corona across globe.
The parayanams will be telecast live from 07.00-09.00 am by the TTD’s SVBC channel to encourage devotees to witness and practice from their homes and become partners in the divine endeavour.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే 2న ఆంజనేయస్వామివారు లంకా దహనం – రాక్షస సంహరం సర్గల పారాయణం
– 13వ విడత సుందరకాండ అఖండ పారాయణం
తిరుమల, 2021 మే 01: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మే 2వ తేదీ ఆదివారం 13వ విడత సుందరకాండ అఖండ పారాయణం జరుగనుంది. కోవిడ్ – 19 నిబంధనలు పాటిస్తూ ఈ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ఉదయం 7 గంటల నుండి సుందరకాండలోని 54వ సర్గ నుంచి 57వ సర్గ వరకు ఉన్న 171 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఈ పారాయణ కార్యక్రమంలో అత్యంత కీలకమైన లంకా దహనం – రాక్షస సంహరం సర్గలను పారాయణం చేయడం వలన ఆరోగ్యం, సంపద వంటి మహా ఫలితాలు లభిస్తాయని పండితులు తెలిపారు. కాగా ఇప్పటివరకు టిటిడి 12 విడతల్లో అఖండ పారాయణాన్ని విజయవంతంగా నిర్వహించింది.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్నిఉదయం 7 నుండి 9 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.