TIRUCHANOOR VASANTHOTSAVAM _ మే 21న శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలకు అంకురార్ప‌ణ‌

TIRUPATI, 20 MAY 2024: The three-day annual Vasanthotsavam in Tiruchanoor will commence on May 22 and conclude on May 24 with Ankurarpanam on May 21.

Everyday there will be snapana Tirumanjanam in Friday Gardens to Padmavati Ammavaru.

TTD has cancelled all arjita sevas on these three days.

Grihastas can participate on payment of Rs.150 per ticket per person.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 21న శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలకు అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2024 మే 20: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మే 22 నుండి 24వ తేదీ వరకు వైభ‌వంగా జరుగనున్నాయి. మే 21వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణం నిర్వ‌హిస్తారు.

ఉత్సవాల్లో భాగంగా మే 23వ తేదీ ఉదయం 7.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మ‌వారు విహరించి భ‌క్తుల‌ను కటాక్షించనున్నారు. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.

ఈ ఉత్స‌వాల కార‌ణంగా మే 21 నుండి 24వ తేదీ వ‌రకు క‌ల్యాణోత్స‌వం, సహ‌స్ర‌దీపాలంకార‌సేవ‌, మే 23న తిరుప్పావ‌డ సేవ‌, మే 24న లక్ష్మి పూజ ఆర్జిత‌సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.