VENGAMAMBA JAYANTI IN TIRUMALA _ మే 22న తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు
TIRUMALA, 21 MAY 2024: On the occasion of the 294th Jayanti of Matrusri Tarigonda Vengamamba, a series of events are lined up in Tirumala on Wednesday.
Tarigonda Vengamamba, an ardent devotee of Tirumala Sri Venkateswara Swamy in the 18th Century who penned many popular kritis on Sri Venkateswara Swamy and Nrisimha Swamy. She also pioneered Annaprasadam in Tirumala.
From 3pm to 4:30pm TTD Asthana Singer Dr Balakrishna Prasad along with Annamacharya artist Smt Bullemma will present Sankeertans penned by Vengamamba on Nada Neerajanam.
Pushpanjali will be offered at Vengamamba Vrindavan in Tirumala by 4.30 pm. From 5.30 pm onwards Sri Malayappa along with Ubhayanancharis will take a procession through the streets to reach Sri Padmavathi Parinayotsava Mandapam in Narayangiri Gardens.
From 6 pm, onwards, artists of the Annamacharya project will conduct a Gosthiganam of Tarigonda Vengamamba Sankirtanas.
HH Sri Sri Sri Swarupananda Swamiji of Visakha Sarada will deliver the religious discourse at 7 pm.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మే 22న తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు
తిరుమల, 2024 మే 21: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు మే 22వ తేదీన తిరుమలలో వైభవంగా జరుగనున్నాయి.
నాది నిరాజనం వేదికపై…
బుధవారం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు టీటీడీ ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి శ్రీమతి బుల్లెమ్మ బృందం తరిగొండ వెంగమాంబ సంకీర్తనలను ఆలపించునున్నారు.
సాయంత్రం 4.30 గంటలకు తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి సమర్పిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానంలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వర పరిణయోత్సవ మండపానికి ఉభయనాంచారీ సమేతంగా శ్రీవారు పురవీధుల గుండా వేంచేపు చేస్తారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామిజీ అనుగ్రహభాషణం చేయనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.