మే 23 నుండి 25వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు

మే 23 నుండి 25వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు

తిరుపతి, మే 01, 2013: వైఎస్సార్‌ కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 23 నుండి 25వ తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఆలయ పుష్కరిణిలో మూడు రోజుల పాటు సాయంత్రం వేళ తెప్పలపై విహరించనున్నారు. స్వామి, అమ్మవారు మొదటి రోజు మూడు చుట్లు, రెండో రోజు ఐదు చుట్లు, చివరి రోజు ఏడు చుట్లు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం భక్తి సంగీత కచేరి, హరికథాగానం,  కోలాటాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.