TTD TO COMMENCE LADDU PRASADAM SALES FROM MAY 25 ACROSS ALL DISTRICT HQ IN AP _ మే 25 నుండి 13 జిల్లా కేంద్రాల్లోని టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల్లో శ్రీ‌వారి ల‌డ్డూప్ర‌సాదం

Tirumala, 22 May 20: TTD has set to commence the sale of its sacred laddu Prasadam from May 25 onwards at the Head Quarters of 13 districts of Andhra Pradesh.

TTD board has decided to sell the Srivari laddus at TTD Kalyana Mandapam in the districts at half rates till the commencement of Srivari darshan to pilgrims after lifting of the lockdown restrictions by the Government. In the case of Krishna District, the sale of laddus will be carried out from TTD Kalyana Mandapam located at Vijayawada.

The 175gm weighing Srivari laddu, which is currently priced at Rs 50, will be sold at fifty percent discount at Rs 25 each during lockdown period. For more details and devotees are shall call TTD toll free numbers – 18004254141 or 1800425333333 

In the event of the requirement of above1000 laddus, devotees should submit their name and mobile number along with their requirements, five days in advance to the email  -tmlbulkladdus@gmail.com. The devotees willing to procure bulk laddus will get the details of modalities of procurement to their mail. They shall procure the laddus based on the availability from Laddu Counters located at Tirupati or from the respective Kalyana Mandapams located in all the District HQ.

Devotees are advised to wear masks and observe social distancing in view of Covid-19 pandemic when they take delivery of Laddus at Kalyana Mandapams located in the HQ of the respective districts.

TTD plans to resume supply of Srivari laddu Prasadam at the TTD information centres located in Chennai, Bangalore and Hyderabad after the approval from respective state governments for transportation of laddus.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

మే 25 నుండి 13 జిల్లా కేంద్రాల్లోని టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల్లో శ్రీ‌వారి ల‌డ్డూప్ర‌సాదం
 
తిరుమల, 2020 మే 22: తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూప్ర‌సాదం మే 25వ తేదీ నుండి రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో గ‌ల‌ టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల్లో అందుబాటులోకి రానుంది. అయితే, కృష్ణా జిల్లాకు సంబంధించి విజ‌య‌వాడ‌లోని టిటిడి క‌ల్యాణ‌మండ‌పంలో ల‌డ్డూలను అందుబాటులో ఉంచుతారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టించిన లాక్‌డౌన్ ముగిసి తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తించేంత వ‌ర‌కు స‌గం ధ‌ర‌కే స్వామివారి ల‌డ్డూప్ర‌సాదాన్ని అందించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. 
 
ఈ మేర‌కు చిన్న‌ల‌డ్డూ ధ‌ర‌ను రూ.50/- నుండి రూ.25/-కు త‌గ్గించారు. ల‌డ్డూప్ర‌సాదానికి సంబంధించిన స‌మాచారం కోసం టిటిడి కాల్ సెంట‌ర్ టోల్‌ఫ్రీ నంబ‌ర్లు : 18004254141 లేదా 1800425333333 సంప్ర‌దించ‌వ‌చ్చు. 
 
ఎక్కువ మొత్తంలో కావాలంటే…
 
ఎక్కువ మొత్తంలో అన‌‌గా 1000కి పైగా ల‌డ్డూలు కొనుగోలు చేయ‌ద‌లిచిన‌ భ‌క్తులు త‌మ పేరు, పూర్తి చిరునామా, మొబైల్ నంబ‌రు వివ‌రాల‌ను 5 రోజుల ముందుగా tmlbulkladdus@gmail.com అనే మెయిల్ ఐడికి పంపాల్సి ఉంటుంది.  లడ్డూలు పొందడానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ మెయిల్ ద్వారా సంబంధిత భక్తులకు తెలియజేయడం జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో ల‌డ్డూల కోసం అనుమ‌తి పొందిన భ‌క్తులు ల‌భ్య‌త‌ను బ‌ట్టి తిరుప‌తిలోని టిటిడి ల‌డ్డూ కౌంట‌ర్ నుండి గానీ, సంబంధిత జిల్లా కేంద్రాల్లోని టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల నుండి గానీ పొంద‌వ‌చ్చు. కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి నేప‌థ్యంలో ఆయా క‌ల్యాణ‌మండ‌పాల వ‌ద్ద ల‌డ్డూలు పొందేందుకు వ‌చ్చే భ‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా భౌతిక దూరాన్ని పాటించాల‌ని, మాస్కులు ధ‌రించాల‌ని టిటిడి విజ్ఞ‌ప్తి చేస్తోంది. ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల నుండి అనుమ‌తి వ‌చ్చిన అనంత‌రం హైద‌రాబాద్‌, చెన్నై, బెంగ‌ళూరులోని టిటిడి స‌మాచార కేంద్రాల్లో ల‌డ్డూప్ర‌సాదాన్ని అందుబాటులో ఉంచ‌డం జ‌రుగుతుంది. 
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.