SPECIAL SAHASRA KALASHABISEKA TO SRI BHOGA SRINIVASA MURTY ON MAY 28 _ మే 28న శ్రీ భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం

Tirumala, 22 May 2023: TTD is organising a grand Sahasra Kalashabishekam to Sri Bhoga Srinivasa Murty of Srivari temple on May 28 in Tirumala.

 

The special abisekham will be performed at the Bangaru vakili in srivari temple between 6am and 8:30am and all arjita Sevas will be held as usual.

 

LEGEND

 

The 18 inch silver idol of Sri Bhoga Srinivasa Murty was presented to Srivari temple by Pallava Queen Samavai Perundevi in 614BC. To commemorate this historical occasion, TTD has been observing the special Sahasra Kalashabisekam every year from the past over one and a half decades.

 

The idol is considered as Koutuka Beram, one among the Pancha Maha Beras and Sri Bhoga Srinivasa Murthy is also known as Sri Manavala Perumal and mentioned in inscriptions of Srivari temple.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
మే 28న శ్రీ భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం
 
తిరుమ‌ల‌, 2023 మే 22: తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి మే 28వ తేదీన ప్రత్యేకంగా సహస్రకలశాభిషేకం జరుగనుంది. 17 ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
 
ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల నడుమ శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి అర్చకస్వాములు ఏకాంతంగా సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంనాడు శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా కొనసాగుతాయి.
 
చారిత్రక నేపథ్యం :
 
పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీ.శ 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవుగల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. ఇందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. పల్లవరాణి కానుకకు సంబంధించిన ఈ శాసనం ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వేంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఆగమం ప్రకారం శ్రీవారి ఆలయంలోని పంచబేరాల్లో ఒకరైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి అని, శ్రీ మనవాళపెరుమాళ్‌ అని కూడా పిలుస్తారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.