SHODASHADINA SUNDARAKANDA AKHANDA PARAYANAMS FROM MAY 3-18 _ మే 3 నుండి 18వ తేదీ వ‌ర‌కు షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం

DIKSHA AND JAPA YAGNAM FOR WELFARE OF ALL

Tirumala, 28 Apr. 21: TTD is organising Shodashadina Sundarakanda Akhanda Parayanams once again from May 3-18 seeking relief for humanity from the pandemic Corona 2.0. 

The parayanams conducted as part of TTD’s spiritual Campaign with Diksha’s and Japa Yajnam will be held daily morning at the Vasantha Mandapam in Tirumala and 16 Veda Pundits will perform the parayanams.

Similarly, another team of 16 Veda and Vaikhanasa Agama pundits will conduct Homas, Japam and Tarpanams at the Dharmagiri SV Veda vijnan peetham thrice a day -morning, afternoon and evening.

 

Legends say that such Shodashadina parayanams will beget good results and health for humanity on a war footing. Vedic pundits say that Sundarakanda is a Garland of divine words and its purpose is to deliver the universe from the pandemic through its chanting for 16 days in a phased manner focusing on each word from specific shlokas of each sarga in the holy aksharamala.

Hence TTD took up the divine task of Sundarakanda parayanams after the spikes in the second wave of the pandemic.

Earlier in the Corona 1.0 season TTD took up Sundarakanda, Virat parvam, Bhagavadgita, Veda Parayanams besides Yogasista visuchika nivararana mantram, Dhanvanthri Maha mantram parayanams at the Nada Niranjanam platform during 2020 .It is popularly regarded that all the yagas, parayanams and Japam conducted by TTD had brought huge succour from Corona to humanity till now,

However many unhealthy lapses in the public domain like not observing masks, not keeping social distancing and failure to observe all health safety guidelines has led to a revival of the Corona pandemic with several mutations.

The Shodashadina Sundarakanda Akhanda Parayanams will be telecast live by the SVBC for benefit of devotees across the globe.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 3 నుండి 18వ తేదీ వ‌ర‌కు షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం

– లోక‌క్షేమం కోసం పారాయ‌ణ దీక్ష‌లు – జ‌ప‌య‌జ్ఞాలు

ఏప్రిల్ 28, తిరుమల 2021: లోక‌సంక్షేమం కోసం, క‌రోనా మ‌హ‌మ్మారిని మాన‌వాళికి దూరం చేయాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ మే 3 నుండి 18వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌లో షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం జ‌రుగ‌నుంది.

తిరుమ‌ల‌లోని వ‌సంత‌ మండ‌పంలో ప్ర‌తిరోజూ ఉద‌యం 16 మంది వేద‌, శాస్త్ర పండితుల‌తో పారాయ‌ణ‌దీక్ష చేప‌డ‌తారు. అలాగే మ‌రో 16 మంది వైఖాన‌స పండితులు ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం ధ‌ర్మ‌గిరి శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విజ్ఞాన‌పీఠంలో జ‌ప‌, త‌ర్ప‌ణ‌, హోమాదులు నిర్వ‌హిస్తారు. షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణలో జ‌ప – త‌ర్ప‌ణ – హోమాదులు స‌క‌లశుభాలను ప్ర‌సాదిస్తాయి. ఆయురారోగ్యాలు వెంట‌నే అనుగ్ర‌హిస్తాయి.

శ్రీ‌‌మ‌త్ సుంద‌ర‌కాండ ఒక మ‌హామంత్ర అక్ష‌ర స‌ముదాయం. హ‌నుమ‌ద్వైభ‌వ సౌంద‌ర్యం. హ‌నుమ‌ద్వ‌ర్ణిత సీతారామ సౌంద‌ర్యం. సీతాసాథ్వి పాతివ్ర‌త్య‌ ప్ర‌భావ సౌంద‌ర్యం ముందు భౌతికంగా సుంద‌ర‌మైన లంక‌ వెల‌వెల‌పోయింది. ఈ సుంద‌ర‌మైన కాండ‌లో ప్ర‌తి అక్ష‌రం మంత్రాక్ష‌ర‌మే. అమృత‌స్వ‌రూప‌మే. సుంద‌ర‌కాండ దీక్ష‌గా చేసే పారాయ‌ణానికి అనేక ప‌ద్ధ‌తులున్నాయి.

స‌ర్వ‌విప‌త్తులు తొల‌గ‌డానికి, స‌క‌ల సంప‌ద‌లు క‌ల‌గ‌డానికి, శ‌త్రుపీడ నివార‌ణ‌కు, న‌ష్ట‌వ‌స్తువులు తిరిగి ల‌భించ‌డానికి, ఆప‌ద‌లు తొల‌గ‌డానికి, వ్యాధులు న‌య‌మ‌వ‌డానికి, త‌ల‌పెట్టిన ధ‌ర్మ‌కార్య‌ముల ఫ‌లాన్ని పొంద‌డానికి, భ‌గ‌వ‌ద‌నుగ్ర‌హానికి, గ్ర‌హ‌దోష నివార‌ణ‌కు ఇలా ఎన్నో మ‌హాఫ‌లాలను ప్ర‌సాదించే శ‌క్తి ఉన్న మ‌హామంత్రం శ్రీ‌మ‌త్ సుంద‌ర‌కాండ‌. ఈ పారాయ‌ణ దీక్ష‌లో షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ పారాయణం ఏకా‌వృత్తిగా చేయ‌డానికి ఒక ప‌ద్ధ‌తి ఉంది. అంటే 16 రోజుల‌లో క – ట – ప – యాది సంకేతాక్ష‌రాల‌తో పారాయ‌ణ చేసే ప‌ద్ధ‌తి. ఇది చాలా ప్ర‌సిద్ధ‌మైన‌ది. అంటే ఒక్కో ద‌శ‌కంలో ఉండే అక్ష‌ర సంఖ్య‌ను బ‌ట్టి ఆ అక్ష‌ర మార్గ‌ద‌ర్శ‌నంలో అన్ని స‌ర్గ‌లు పారాయ‌ణం చేయ‌డం – దీనికి ఆధారంగా రెండు పాదాలున్నాయి.

మొద‌టిది –

2 4 4 4 8 1 8 1 5 5 7 6 1 6 2 4
రా ఘ వో వి జ యం ద ద్యా న్మ మ సీ తా ప తిః ప్ర భుః

త‌ల‌పెట్టిన కార్యానికి విజ‌యాన్ని చేకూర్చే ఈ ప‌ద్ధ‌తిలో 16 రోజుల పారాయ‌ణాన్ని గ‌తేడాది తితిదే పారాయ‌ణ – జ‌పం – త‌ర్ప‌ణం – హోమాల‌తో చ‌క్క‌గా నిర్వ‌హించింది. క‌రోనా విజృంభ‌ణ స‌న్న‌గిల్లింది. అయితే మాన‌వుల త‌ప్పిదాలు – అంటే ప‌రిస‌రాల అప‌రిశుభ్ర‌త‌, స‌రైన ఆరోగ్య‌జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం, చేతులు శుభ్రంగా క‌డుక్కోక‌పోవ‌డం, ముఖ‌వ‌స్త్రాన్ని జాగ్ర‌త్త‌గా నోటి ద‌గ్గ‌ర‌, ముక్కు ద‌గ్గ‌ర ఉంచుకోక‌పోవ‌డం వంటి వాటి వ‌ల్ల ఈ క‌రోనా మ‌హ‌మ్మారి మునుప‌టి కంటే వికృతంగా దాడి చేస్తోంది. క‌నుక‌, దీని సంపూర్ణ నివార‌ణ‌కు, తొంద‌ర‌గా అంద‌రికీ ఆరోగ్యం ల‌భించ‌డం, మ‌ర‌ణ‌భ‌యం తొల‌గ‌డం స‌మాజంలో చాలా అవ‌స‌రం.

అందుక‌ని

రా ఘ వ స్య ప ద ద్వం ద్వం ద ద్యా ద మి త వై భ వ మ్‌||
2 – 4 – 4 – 1 – 1 -8 4 – 4 8 -1 – 8 – 5 – 6 – 4 – 4 – 4

ఈ అక్ష‌ర‌మార్గంలో నిర్దిష్ట స‌ర్గ‌ల పారాయ‌ణం – జ‌ప – త‌ర్ప‌ణ – హోమాదుల‌తో సుంద‌ర‌కాండ అఖండ షోడ‌శ‌దిన పారాయ‌ణ జ‌రిపించాల‌ని తితిదే సంక‌ల్పించింది.

లోక‌క్షేమం కోసం పారాయ‌ణ దీక్ష‌లు – జ‌ప‌య‌జ్ఞాలు

విషూచికా మ‌హ‌మ్మారి(క‌రోనా) ప్ర‌బ‌లిన నేప‌థ్యంలో స‌మ‌స్త ప్రాణికోటి అభ్యుద‌యానికి, సుఖ‌శాంతుల‌కు, విశ్వ‌శాంతికి తితిదే పారాయ‌ణ దీక్ష‌లు ప్రారంభంచింది. నాద‌నీరాజ‌నం వేదిక‌గా 1. సుంద‌ర‌కాండ‌, 2. విరాట‌ప‌ర్వం, 3. భ‌గ‌వ‌ద్గీత‌, 4. వేద‌పారాయ‌ణం, 5. యోగ‌వాశిష్టంలోని విషూచికా నివార‌ణ మంత్రం, ధ‌న్వంత‌రీ మ‌హామంత్ర పారాయ‌ణ‌లు జ‌రుగుతున్నాయి. గత సంవత్సరం సాక్షాత్తు తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం ముందు నాద‌నీరాజ‌న మండ‌పంలో జ‌రిగిన ఈ మ‌హా అఖండ పారాయ‌ణ దీక్ష‌లు ప్ర‌పంచంలోని క‌రోనా ఉద్ధృతిని శాంతింప‌చేశాయి.

కానీ, మాన‌వాళి తెలిసీ తెలియ‌కుండా – అప‌రిశుభ్ర‌త‌, విశృంఖ‌ల అనారోగ్యక‌ర‌ విహారాలు అంటే మాస్కు ధ‌రించ‌క‌, ఆరోగ్య సూత్రాలు పాటించ‌క‌, భౌతిక‌దూరం పాటించ‌క కొని తెచ్చుకున్న క‌ష్టాలివి. కానీ నిష్కామ‌క‌ర్మ యోగి హ‌నుమ ర‌క్ష‌ణ దీక్ష‌ను తెలిపే సుంద‌ర‌కాండను, మంచివాన‌లు, చ‌క్క‌ని పాడిపంట‌ల‌నిచ్చే విరాట‌ప‌ర్వం, భ‌గ‌వ‌త్ త‌త్త్వాన్ని చెప్పేది, ధ‌ర్మ‌చింత‌న క‌లిగించేది, మ‌న‌శ్శాంతిని, ఆద‌ర్శ‌జీవ‌నాన్ని ఇచ్చేది భ‌గ‌వ‌ద్గీత – విషూచికా నివార‌ణ మంత్రం, ధ‌న్వంత‌రీ మంత్రాల వ‌ల్ల అనారోగ్యం తొల‌గి, ఆరోగ్యం, దీర్ఘాయుష్షు క‌లుగుతాయి. వేద పారాయ‌ణం వ‌ల్ల స‌క‌ల‌శ్రేయ‌స్సులు మ‌హ‌దైశ్వ‌ర్య‌ప్రాప్తి క‌లుగుతాయి. విశేషించి ధ‌న్వంత‌రి మ‌హాయాగం, షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ పారాయ‌ణలో జ‌ప – త‌ర్ప‌ణ – హోమాదులు స‌క‌లశుభాలు ప్ర‌సాదిస్తాయి. ఆయురారోగ్యాలు వెంట‌నే అనుగ్ర‌హిస్తాయి. వైఖాన‌స ఆగ‌మానికి ఊపిరి వంటిది పార‌మాత్మిక ఉప‌నిష‌త్తు. ఈ ఉప‌నిష‌త్తు పారాయ‌ణం సంక‌ల్ప‌పూర్వ‌కంగా 5 రోజుల పాటు దీక్ష‌గా చేయ‌డం వ‌ల్ల సంపూర్ణంగా శ్రీ‌వారి అనుగ్ర‌హం ల‌భిస్తుంది. ఆయురారోగ్య ఐశ్వ‌ర్యాలు సిద్ధిస్తాయి. తితిదే ఈ కార్య‌క్ర‌మాల‌ను శ్రీ‌వారి భ‌క్తులంద‌రికీ ఉప‌యోగ‌ప‌డేట‌ట్లుగా శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డం జ‌రుగుతున్న‌ది. భ‌క్తులు స‌ద్వినియోగ‌ప‌రుచుకోవాల‌ని మ‌న‌వి.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.