ANNAMACHARYA JAYANTI FETE _ మే 6 నుండి 12వ తేదీ వరకు అన్నమయ్య 615వ జయంతి ఉత్సవాలు
TIRUPATI, 04 MAY 2023: The 615th Jayanti fete of Saint Poet Sri Tallapaka Annamacharya will be observed in big manner by TTD at Tirupati and Tallapaka from May 6-12.
Annamacharya Project Director Sri Vibhishana Sharma is supervising the arrangements.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మే 6 నుండి 12వ తేదీ వరకు అన్నమయ్య 615వ జయంతి ఉత్సవాలు
తిరుపతి, 2023 మే 04: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 615వ జయంతి ఉత్సవాలు మే 6 నుండి 12వ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరుగనున్నాయి. ఇందులో భాగంగా మే 6 వ తేదీన తాళ్లపాకలోని ధ్యానమందిరం వద్ద ఉదయం 10 గంటలకు శ్రీవారి కల్యాణం నిర్వహిస్తారు.
తాళ్లపాకలో..
మే 6 నుండి 8వ తేదీ వరకు సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు తాళ్లపాకలోని ధ్యానమందిరం , 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తిరుపతిలో..
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మే 6న ఉదయం 9 గంటలకు సప్తగిరి గోష్టిగానం, సాయంత్రం 6 గంటలకు సంగీత సభ జరగనుంది. మే 7 నుండి 12వ తేదీ వరకు ఉదయం 10.30 గంటలకు సాహితీ సదస్సు, సాయంత్రం 6 గంటల నుండి ప్రముఖ విద్వాంసుల గాత్ర, వాద్య, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.