SPECIAL ABHISHEKAM TO SRI LNSWAMY ON FIRST GHAT ROAD _ మొదటి ఘాట్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక అభిషేకం

Tirumala, 22 November 2022: TTD on Tuesday organised vishesha Abhisekam at Sri Lakshmi Narasimha Swami temple on the footpath of first Ghat road as part of the tradition to perform it on Swati Thiru nakshatram during the sacred Karthika Masam.

 

Archakas performed the vishesha abhisekam to Mula murti at the temple in the early hours.

 

Srivari temple Parupattedar Sri Uma Maheswar Reddy, Archakas and other TTD officials were present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మొదటి ఘాట్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక అభిషేకం

తిరుమల, 2022 న‌వంబ‌రు 22: తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి మంగళవారం ప్రత్యేక అభిషేకం చేపట్టారు. కార్తీక మాసంలో స్వాతి తిరునక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.

ఇందులో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మూలమూర్తికి ఉదయం అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పార్ పత్తేదార్ శ్రీ ఉమామహేశ్వరరెడ్డి, ఆర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.