యాత్రికులకు అందుబాటులో విష్ణునివాసం వసతి సముదాయం
యాత్రికులకు అందుబాటులో విష్ణునివాసం వసతి సముదాయం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం తితిదే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం పేరిట యాత్రికుల వసతి సముదాయం నిర్మించింది. ఆర్టిసి బస్టాండుకు, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ వసతి సముదాయం సాధారణ యాత్రికులకు చాలా అనువుగా ఉంటోంది. ఇందులో 204 ఏసీ గదులు, 204 నాన్ ఏసీ గదులు, 24 డార్మిటరీ హాళ్లు యాత్రికులకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ భక్తుల కోసం సుదర్శనం టికెట్ కౌంటర్, కార్ పార్కింగ్, ఉచిత వైద్యశాల, పుస్తక విక్రయశాల, బ్యాంకు కౌంటర్, తిరుమలకు ఆర్టిసి బస్సు తదితర సౌకర్యాలను తితిదే కల్పించింది. ఇందులోని గదుల అద్దె వివరాలు కింది విధంగా ఉన్నాయి.
వ.సంఖ్య గదులు ఒక రోజుకు అద్దె డిపాజిట్
1. 196 నాన్ ఏసీ గదులు రూ.300/- రూ.350/-
2. 196 ఏసీ గదులు రూ.800/- రూ.800/-
3. 8 నాన్ ఏసీ సూట్లు రూ.500/- రూ.500/-
4. 8 ఏసీ సూట్లు రూ.1300/- రూ.1300/-
విష్ణునివాసం వసతి సముదాయంలోని అధికారుల ఫోన్ నంబర్లు కింది విధంగా ఉన్నాయి.
1. డెప్యూటీ ఈఓ(రిసెప్షన్) ఛాంబర్ – 0877-2264466
2. ఏఈఓ ఛాంబర్ – 0877-2264469
3. రిసెప్షన్ కౌంటర్ – 0877-2264462
4. డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ – 0877-2264464
5. విష్ణునివాసం వైద్యశాల – 0877-2264465
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.