ANKURARPANAM HELD AT RAMPACHODAVARAM _ రంపచోడవరంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయమహాసంప్రోక్షణకు అంకురార్పణ
TIRUPATI, 17 MAY 2023: Ankurarpanam was held on Wednesday evening at Rampachodavaram in Alluri Seetarama Raju district in connection with Maha Samprokshanam festivities in the Srivari temple.
On May 22, the Maha Samprokshanam will be observed between 9am and 9,30am in the auspicious Mithuna Lagnam followed by darshan to devotees from 10am onwards. On the same day evening, Srivari Kalyanam will be observed.
DyEOs Sri Gunabhushan Reddy, Sri Venkataiah, Sri Siva Prasad, DyEE Sri Ananda Ram were also present. While the rituals were being carried out under the supervision one of the chief priests of Tirumala temple Sri Venugopala Deekshitulu.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
రంపచోడవరంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయమహాసంప్రోక్షణకు అంకురార్పణ
– మే 22న మహాసంప్రోక్షణ, శ్రీవారి కల్యాణోత్సవం
తిరుపతి 17మే 2023: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాలకు బుధవారం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. మే 22 వ తేదీ మహాసంప్రోక్షణ, శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.
కాగా బుధవారం సాయంత్రం అంకురార్పణలో భాగంగా ఆచార్యవరణం, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం చేపట్టారు.
మే 22న ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటల వరకు మిథున లగ్నంలో మహా సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు , డెప్యూటీ ఈవోలు
శ్రీ గుణభూషణ రెడ్డి, శ్రీ వెంకటయ్య, శ్రీ శివ ప్రసాద్, డెప్యూటీ ఈఈ శ్రీఆనంద రామ్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.