HANUMAN’S BRILLIANCE IN CHATURVEDA IS PEERLESS-TRIDANDI AHOBILA SEER _ చతుర్వేద పండితుడు హనుమంతుడు : శ్రీశ్రీశ్రీ అహోబిల త్రిదండి రామానుజ జీయర్ స్వామి
TIRUPATI, 17 MAY 2023: The brilliance of Hanuman in Chaturvedas was peerless and his knowledge was incomparable said Sri Ahobila Tridandi Ramanuja Jeeyar Swamiji.
On the fourth day evening as part of the five day Hanuman Jayanti festivities in Nada Neerajanam platform in Tirumala on Wednesday, the seer in his Anugraha Bhashanam said, Anjana Devi, the mother of Hanuman performed penance in Anjanadri Tirumala and given birth to Anjaneya and there are many puranic references to prove that Anjanadri is the birth place of Anjaneya, he reiterated.
The devotional cultural programmes organised at Akasa Ganga and Japali by TTD allured the devotees.
Annamacharya Project Director Dr Vibhishana Sharma was also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
చతుర్వేద పండితుడు హనుమంతుడు : శ్రీశ్రీశ్రీ అహోబిల త్రిదండి రామానుజ జీయర్ స్వామి
– ఆకాశగంగలో ఆకట్టుకున్న హనుమరామనామ సంకీర్తనలు
తిరుమల, 2023 మే 17: హనుమంతుడు ఋగ్వేదం, యజుర్వేదం సామవేదం, అధర్వణ వేదాల్లో పండితుడని, ఆయన వాక్కులు ధర్మబద్ధంగా ఉంటాయని హైదరాబాదులోని జీయర్ మఠానికి చెందిన శ్రీశ్రీశ్రీ అహోబిల త్రిదండి రామానుజ జీయర్ స్వామి అన్నారు. హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాదనీరాజనం వేదికపై స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు.
అంజనాదేవికి వాయు దేవుడి అనుగ్రహంతో వరపుత్రుడిగా జన్మించిన హనుమంతుడికి ధైర్యసాహసాలతోపాటు ధారణశక్తి, మేధాశక్తి అపూర్వంగా ఉన్నాయన్నారు. హనుమంతుని జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రి అని చెప్పేందుకు పౌరాణిక ఆధారాలు చాలా ఉన్నాయన్నారు. వైకుంఠం కంటే తిరుమల గొప్పదని పురాణాల ద్వారా తెలుస్తోందని, బుద్ధిమంతులైన పిల్లలు కలగాలంటే తిరుమలలోని స్వామి పుష్కరిణిలో స్నానం చేసి శ్రీవారిని దర్శించుకోవాలని చెప్పారు.
అంతకుముందు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం శాస్త్ర పండితులు శ్రీ శేషాచార్యులు అన్నమయ్య సంకీర్తనల్లో హనుమంతుడు అనే అంశంపై ఉపన్యసించారు.
అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణ శర్మ పాల్గొన్నారు.
ఆకాశగంగలో ఆకట్టుకున్న హనుమరామనామ సంకీర్తనలు
హనుమజ్జయంతిని పురస్కరించుకుని బుధవారం తిరుమలలోని ఆకాశగంగ శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయం వద్ద గల వేదికపై నిర్వహించిన హనుమరామనామ సంకీర్తనల కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అదేవిధంగా జపాలి తీర్థంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు.
ఆకాశగంగలోని శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయం వద్ద ఉదయం 9 నుండి మధ్యాహ్నం 10.30 గంటల వరకు హనుమరామనామ సంకీర్తనల ఆలాపన జరిగింది. ఉదయం 10.30 నుండి 12 గంటల వరకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళాకారులు భజనలు చేశారు. మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పలు అన్నమయ్య సంకీర్తనలు వీనులవిందుగా గానం చేశారు.
జపాలి శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం వద్ద ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం సంగీత విభాగం ఆచార్యులు శ్రీమతి శైలేశ్వరి బృందం హనుమన్ చాలీసా పఠించారు. హనుమాన్ భజనలు చేశారు. ఉదయం 10.45 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు చక్కగా భజనలు చేశారు. మధ్యాహ్నం 2.30 గంటల నుండి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథా పారాయణం జరిగింది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.