రథసప్తమి సందర్భంగా ఆవిష్కరించనున్న పుస్తకాలు 

రథసప్తమి సందర్భంగా ఆవిష్కరించనున్న పుస్తకాలు

తిరుమల, ఫిబ్రవరి 16, 2013: తిరుమల శ్రీవారి రథసప్తమి పర్వదినం సందర్భంగా తితిదే ముద్రించిన పది పుస్తకాలను స్వామివారి వాహనసేవల ముందు ఆవిష్కరించనున్నారు.
 
ఉదయం 9.00 గంటలకు చిన్నశేష వాహనం ముందు శ్రీ లగడపాటి భాస్కర్‌ రచించిన ”భక్తతిన్నడు”, ప్రొఫెసర్‌ ఎస్‌.జయప్రకాష్‌ రచించిన ”ఆళ్వారుల పాశురాలలో వేంకటేశ్వర వైభవం”, ఉదయం 11.00 గంటలకు గరుడసేవలో శ్రీ రామకృష్ణ దీక్షితులు రచించిన ”శ్రీ వేంకటేశ్వర స్వామి కైంకర్యాలు”, డాక్టర్‌ చిఱ్ఱావూరి శ్రీరామశర్మ రచించిన ”అధర్వవేద సంహిత 8”, ”అధర్వవేద సంహిత 9” పుస్తకాలను ఆవిష్కరించనున్నారు.
అదేవిధంగా మధ్యాహ్నం 1.00 గంటకు శ్రీవారి హనుమంత వాహన సేవలో శ్రీ తిరువాయిపాటి రాఘవయ్య రచించిన ”శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర దివ్యవైభవం”, ప్రొఫెసర్‌ అరుణాచలం రచించిన ”వళ్లలార్‌”, డాక్టర్‌ టి.వి.నారాయణ రచించిన ”అర్షపుత్రశతకం”, సాయంత్రం 4.00 గంటలకు కల్పవృక్ష వాహన సేవలో డాక్టర్‌ చిఱ్ఱావూరి శివరామకృష్ణ శర్మ రచించిన ”అధర్వవేద సంహిత 10”, కె.రామానుజభట్టర్‌ రచించిన ”శ్రీవచన సౌరభం” అనే పుస్తకాలను అధికార ప్రముఖులు ఆవిష్కరిస్తారు.
   
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.