రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై జెఈఓ సమీక్ష
తిరుమల, 2012 ఆగస్టు 21: సెప్టెంబరు 8, 9వ తేదీల్లో భారతదేశ ప్రథమపౌరులు గౌరవ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్‌ముఖర్జీ తిరుమల పర్యటనను దృష్టిలో ఉంచుకుని తితిదే సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం నాడు జరిగింది.
ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఈ నెల 27వ తారీఖున మాక్‌డ్రిల్ కార్యక్రమాన్ని తిరుమలలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కనుక సంబంధిత విభాగాధిపతులు తమకు అప్పగించిన కార్యక్రమాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేసి ఈ మాసాంతానికి సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.