రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ  – టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ  – టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

– గుడికో గోమాత కు ఆవును బహూకరించిన కె డి సి సి బ్యాంక్ చైర్మన్ శ్రీ వెంకట్రావ్

తిరుమల 9 జనవరి 2021: సంక్రాంతి పండుగ సందర్భంగా టీటీడీ దేవాదాయశాఖతో కలసి రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ కార్యక్రమాలు నిర్వహిస్తుందని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరు లోని సిద్దార్ధ ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్ లో శ్రీ వెంకట్రావ్ సంక్రాంతి ఎడ్ల పందేలు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీటీడీ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న గుడికో గోమాత కార్యక్రమానికి శ్రీ వెంకట్రావ్ గోవును దానం చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో టీటీడీ చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడారు.
గోవును పూజించే ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందని ఆయన చెప్పారు. గోవు ముక్కోటి దేవతలతో సమానమని, అందుకే హిందూ ధర్మ ప్రచారం లో భాగంగా టీటీడీ దేశ వ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. డిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ వెంకట్రావ్ టీటీడీ కి గోవును దానం చేయడం సంతోషమన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది