BIRRD FOR MORE PATIENT SERVICES-ESTIMATES COMMITTEE CHAIRMAN _ రోగులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలి : శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్ శ్రీ పి.రాజన్న దొర
Tirupati, 27 Nov. 19: Lauding the efforts of BIRRD Ortho specialty hospital run by TTD, the Chairman of Estimates Committee, Sri P Rajanna Dora said, the hospital is standing as a boon to many ortho patients across the country and the wished that the hospital should give enhanced medicare to the patients.
The Estates Committee visited the BIRRD hospital on Wednesday evening. After a PPP, the Chairman of the committee directed the officials concerned to take care of the patients to the best possible extent.
Earlier the committee inspected Operation Theatre, Intensive Care, Physiotherapy and other wards in the hospital. They also interacted with the patients to know about the medicare who expressed their satisfaction over the facilities provided by TTD to them.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
రోగులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలి : శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్ శ్రీ పి.రాజన్న దొర
తిరుపతి, 2019 నవంబరు 27: తిరుపతిలోని బాలాజి వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధన, పునరావాస కేంద్రం(బర్డ్)లో రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటి ఛైర్మన్ శ్రీ పి.రాజన్న దొర టిటిడి అధికారులకు సూచించారు. తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిని బుధవారం కమిటీ సభ్యులు సందర్శించారు.
ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బర్డ్ కార్యకలాపాలను కమిటీ సభ్యులకు వైద్యులు వివరించారు. అంతకుముందు బర్డ్ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, ఇంటెన్సిన్ కేర్ విభాగం, ఫిజియోథెరపి తదితర విభాగాలను కమిటీ సభ్యులు పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం కమిటీ ఛైర్మన్ బర్డ్‌లో రోగులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోగులకు టిటిడి అందిస్తున్న సౌకర్యాలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బర్డ్ ఇన్‌చార్జ్ సంచాలకులు మరియు జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్, కమిటీ సభ్యులు శ్రీ అమరనాథ రెడ్డి, శ్రీ వి.వేణుగోపాల్‌రెడ్డి, శ్రీ కె.అనిల్‌కుమార్, శ్రీ కిరణ్‌కుమార్, శ్రీ ఎమ్.గిరిధర్‌రావు, శ్రీ డి.రామారావు, శ్రీ పి.అశోక్‌బాబు, స్విమ్స్ సంచాలకులు డా. వెంగమ్మ, బర్డ్ వైద్య సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న శాసనసభ అంచనాల కమిటీ
శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్ శ్రీ పి.రాజన్న దొర, ఇతర సభ్యులు బుధవారం సాయంత్రం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి విఎస్వో శ్రీ ప్రభాకర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏవిఎస్వో శ్రీ నందీశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.