ADI PARVA PARAYANAMS FOR GLOBAL WELFARE- ADDL EO _ లోక కల్యాణార్థం ఆదిపర్వం పారాయణం – టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి
Tirumala, 8 May 2021: TTD is organised the Aadi Parva- Viswa Vijnan Sarswam- parayanams at the Nada Niranjanam platform on Saturday evening, for the well being of Humanity across the globe with blessings of Sri Venkateswara, says TTD Additional EO Sri AV Dharma Reddy.
Participating in the program The TTD Additional EO said the new parayanams followed after the Virat Parvam parayanams launched on July 15, 2020, concluded on Friday.
The Aadi Parva- Viswa Vijnan Sarswam- parayanams will be live telecast by the SVBC from 8.00-9.00 pm daily for benefit of devotees.
Acharya Sri Rani Sudha Murthy of Rashtriya Sanskrit University said the Aadi Parva with 234 chapters, 9000 shlokas is the first of the 18 parvam in Mahabharata describing the birth of Pandavas, Kuru vamsham etc.
Thereafter Sri KSS Avadhani, principal of Dharmagiri Veda vijnan peetham. Sri Satya Kishore Shastri and Sri Sheshacharya rendered the Aadi Parva- Viswa Vijnan Sarswam-parayanams.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
లోక కల్యాణార్థం ఆదిపర్వం పారాయణం – టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి
తిరుమల, 2021 మే 08: శ్రీవారి అనుగ్రహంతో సృష్టిలోని సఖల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని తిరుమలలో ” ఆదిపర్వం – విశ్వవిజ్ఞాన సార్వస్వము ” ప్రారంభించినట్లు టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి ఉద్ఘాటించారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం రాత్రి ” ఆదిపర్వం – విశ్వవిజ్ఞాన సార్వస్వము ” పారాయణం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి అదనపు ఈవో మాట్లాడుతూ జూలై 15వ తేదీన ప్రారంభమైన విరాటపర్వం – లోక కల్యాణము శుక్రవారంతో పూర్తయిందన్నారు. ఇప్పటికే సృష్ఠిలోని సకల జీవరాశులు ఆరోగ్యంగా ఉండాలని యోగ వాశిష్టం – ధన్వంతరి మహామంత్రం, సుందరకాండ పారాయణం. శ్రీ గీతా పారాయణము నిర్వ హిస్తున్నట్లు వివరించారు. ఆదిపర్వంలో వ్యాసమహర్షి రాసిన ప్రతి శ్లోకానికి అర్థతాత్పర్యాలతో పండితులు వివరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్నిఎస్వీబిసిలో ప్రతి రోజు రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం చేస్తారని, భక్తులు ఈ శ్లోకాలను పఠించాలని కోరారు.
అనంతరం రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ వ్యాస మహర్షి అందించిన మహాభాతరంలో మొత్తం 18 పర్వల్లో ఆదిపర్వం మొదటిదన్నారు. పాండవులు జన్మించటానికి ముందు కురువంశం ఎలా ప్రారంభమైంది, మహర్షులు వారి చరిత్రలు తెలియజేస్తోందన్నారు.
ఆదిపర్వంలో 234 అధ్యాయాలు, 9 వేల శ్లోకాలు ఉన్నాయన్నారు. మహాభారతంలోని 18 పర్వల్లో 100 ఉప పర్వలు ఉన్నాయన్నారు. అందులో ఆదిపర్వంలో 19 ఉప పర్వలు ఉన్నాయన్నారు. ఆదిపర్వం పారాయణము చేసిన, శ్రవణం చేసిన ముక్కోటి తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం ఫలం లభిస్తోందన్నారు. అదేవిధంగా సమస్త లోకాలు పవిత్రమై సర్వ రోగాలు నయం అవుతాయన్నారు. ప్రస్తుత కాలంలో మహాభారతం నేటి సమాజంలో మానవాళికి ఎలా ఉపయోగపడుతుందో వివరించారు.
తరువాత వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని ఆధ్వర్యంలో ” ఆదిపర్వం – విశ్వవిజ్ఞాన సార్వస్వము ” పారాయణాన్ని వేదధ్యాపకులు శ్రీ సత్య కిషోర్ శాస్త్రీ, శ్రీ శేషాచార్యులు పఠించారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.