STUDENTS SHOULD SET HIGHER TARGETS TO ACHIEVE HIGHER GOALS- TTD EO _ విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరేందుకు నిర్దిష్టమైన లక్ష్యాలు ఏర్పరచుకోవాలి : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

Tirupati, 22,August 2022: TTD EO Sri AV Dharma Reddy. Has exhorted the students of TTD educational institutions to set higher targets in order to achieve higher goals.

Addressing students during his visit to the Sri Govindaraja Swamy Arts College on Monday morning, the TTD EO said hard work and committed struggle always paid dividends. He also read out an inspiring verse “ sadhanamulna panulu samakuru dharalona “ and gave an anecdote from the Ekalavya episode and some more from Bhagavad-Gita.

He also highlighted the significance of being clean personally and keeping surroundings also clean. He also exhorted students to take up shramdan twice a month.

Later the TTD EO inspected the botany, physics zoology and chemistry labs and directed engineering officials to clear all the wastes lying in front of the college campus and promote greenery. He also requested the JEO to develop a sports complex and to post security guards.

TTD JEO Smt Sada Bhargavi, chief engineer Sri Nageswar Rao, SE (electrical) Sri Venkateswarlu, DEO Sri Govinda Rajan, Additional Health Officer Dr Sunil Kumar, college principal Dr Venugopal Reddy other faculty members were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరేందుకు నిర్దిష్టమైన లక్ష్యాలు ఏర్పరచుకోవాలి : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుపతి, 2022 ఆగస్టు 22: విద్యార్థినీ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరేందుకు విద్యార్థి ద‌శ‌లోనే నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాల‌ని, చ‌క్క‌టి ప్రణాళికతో ల‌క్ష్యాల‌ను సాధించుకోవాలని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి కోరారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలను సోమవారం ఉదయం ఈవో సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు ఈవో ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిరంతరం గుర్తు పెట్టుకోవాల‌ని, జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిరాశ చెందకూడదని చెప్పారు. అకుంఠిత దీక్ష, శ్రమతో ఎంత‌టి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చ‌న్నారు. ఈ సందర్భంగా “సాధనమున పనులు సమకూరు ధరలోన..” అనే పద్యాన్ని విద్యార్థులకు విపులీకరించారు. ఇందుకు ఉదాహరణగా ఏకలవ్యుడి కథను వివరించారు. అదేవిధంగా, భగవద్గీతలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను ఉద‌హరించారు. మంచిస్థాయికి ఎదిగేందుకు క్ర‌మ‌శిక్షణ ఎంతో అవసరమ‌న్నారు. భగవంతుని కన్నా ముందు మన తల్లిదండ్రులను గుర్తుంచుకోవాల‌ని, మన భవిష్యత్తుకు మార్గనిర్దేశనం చేసేది తల్లిదండ్రులు, గురువులు మాత్రమేనని చెప్పారు. పరిశుభ్రతే దైవమ‌ని గాంధీజీ బోధించార‌ని, ఆ ప్ర‌కారం మ‌న ప‌రిస‌రాల‌ను మ‌నమే శుభ్రంగా ఉంచుకోవాల‌ని సూచించారు. విద్యార్థులు నెలకు రెండుసార్లు శ్ర‌మ‌దానం చేసి క‌ళాశాల ప‌రిస‌రాల‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాల‌న్నారు.

అనంతరం కళాశాలలోని బొట‌నీ, ఫిజిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ ప‌రిశోధ‌న‌శాల‌లను ఈవో పరిశీలించారు. కళాశాల వెనుక భాగంలో ఉన్న వ్య‌ర్థాల‌ను తొల‌గించి ప‌రిస‌రాలు ఆహ్లాదకరంగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కళాశాలలో స్పోర్ట్స్ కాంప్లెక్స్, తగినంతమంది సెక్యూరిటీ గార్డుల‌ను ఏర్పాటు చేయాలని జెఈవోను కోరారు .

ఈవో వెంట జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గవి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్‌) శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు, విద్యాశాఖ‌ అధికారి శ్రీ గోవిందరాజన్, అద‌న‌పు ఆరోగ్యశాఖాధికారి డాక్ట‌ర్ సునీల్ కుమార్‌, కళాశాల ప్రిన్సిపాల్ డా. వేణుగోపాల్‌రెడ్డి, అధ్యాప‌కులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.