వివరణ

తిరుపతి, 2010 ఆగష్టు 06

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
                               

వివరణ

ఆగష్టు 5వ తేదిన ”ఈనాడు ” దినపత్రిక నందుప్ర‌చురించిన ”డిప్యూటేషన్‌ పదవుల ఎంపిక?”,
”ప్రభుత్వానికి ప్రతిపాదనలు, పట్టువదలని ఈవో” అని ప్రచురించిన వార్త నిజం కాదు. తితిదేలో డిప్యుటేషన్‌పై 6 మంది డిప్యూటి ఈవో పోస్టులను భర్తీచేయడానికి ప్రభుత్వం ఇది వరకే జి.ఓ. జారీచేసిన విషయం విదితమే. అయితే అందుకు సంబంధించి ఏఏవిభాగాలలో డిప్యూటి ఈవోలు అవసరమో తితిదే ప్రభుత్వానికి ఎలాంటి లేఖ వ్రాయలేదు.

అయితే సదరు వార్తలో ఈవో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు, ఏఏ విభాగాలలో డిప్యూటి ఈవోలు అవసరమో ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఇది పూర్తిగా వాస్తవదూరం. కనుక ఈ సమాచారాన్ని రేపటి మీ దినపత్రిక నందు వివరణగా ప్రచురించవలసిందిగా కోరుచున్నాము.

ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి