వివరణ

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి
 వివరణ

తిరుపతి, 2010 ఆగష్టు 17: ఆగష్టు 12వ తేదిన ”వార్త ” దినపత్రిక నందుప్ర‌చురించిన ”శ్రీవారి ఆభరణాల మాయం కేసు సిబిఐకి?”, ”ఆర్కియాలజీ నిపుణులచేత పూర్తికావస్తున్న పరిశీలన”, ”కోట్లాది ఆభరణాలను దిగమింగిన మహంతులు”, ”దొంగతనాలు ఆనాది నుండి వస్తున్నవే”, ”సీరియస్‌గా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర‌ ప్రభుత్వాలు” అని ప్రచురించిన వార్తలో ఇఓ గారి వివరణకు ఆపాదిస్తూ ఇచ్చిన వార్త కొంత సత్యదూరంగా ఉంది.

వాస్తవానికి శ్రీవారి ఆభరణాల విషయమై మీతో మాట్లాడిన సందర్భంలో కార్యనిర్వహణాధికారి కేవలం ఆర్కియాలజీ నిపుణులచేత పరిశీలన జరిపేందుకు నిర్ణయం తీసుకున్నామని, అది 15 రోజులలో పూర్తి అవుతుందని తెలిపారే తప్ప ఇతర విషయాలు మాట్లాడలేదని తెలియజేస్తున్నాం. అంతేగాక సదరు వార్తలో వాస్తవాలు తెరమీదకు రావాలంటే ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపిస్తే అభ్యంతరం లేదని వార్త వ్రాయడం కూడా వాస్తవం కాదు. అసలు కార్యనిర్వహణాధికారి సిబిఐ విచారణకు సంబంధించి మాట్లాడకనే మాట్లాడినట్లు సదరు వార్తలో పేర్కొనడం భావ్యంకాదు. కనుక ఈ సమాచారాన్ని రేపటి మీ దినపత్రిక నందు వివరణగా ప్రచురించవలసిందిగా కోరుచున్నాము.

ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి