వివరణ _ ఆర్జిత సేవల ఏకాంతానికి టిటిడి యోచన వార్త వాస్తవ దూరం

వివరణ

ఆర్జిత సేవల ఏకాంతానికి టిటిడి యోచన వార్త వాస్తవ దూరం

జూలై 18వ తేదిన సాక్షి దినపత్రికనందు ఆర్జిత సేవల ఏకాంతానికి టిటిడి యోచన అనుశీర్షికన ప్రచురితమైన వార్తనందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం భారీ వసతి సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అని ప్రచురించడం జరిగింది. ఇది వాస్తవం కాదు.  

అయితే వాస్తవానికి కార్యనిర్వహణాధికారి ఏటిసి కార్‌ పార్కింగ్‌ స్థలాన్ని సందర్శించినపుడు ఇక్కడ ఆధునిక రీతిలో కార్‌ పార్కింగ్‌, వసతి సముదాయాలను ఏర్పాటు చేయాడానికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి త్వరలో జరుగనున్న పాలక మండలికి సమర్పించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడం జరిగిందే తప్ప, ఎటువంటి నిర్ణయాలు జరుగలేదు.

కనుక ఈ సమాచారాన్ని రేపటి మీ దినపత్రికనందు వివరణగా ప్రచురించాల్సిందిగా కోరడమైనది.

ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు