వివరణ_ ‘తోమాల, అర్చన సమయంలో సర్వదర్శనం’ వార్త వాస్తవ దూరం

వివరణ

‘తోమాల, అర్చన సమయంలో సర్వదర్శనం’ వార్త వాస్తవ దూరం

జూలై 18వ తేదిన ఈనాడు దినపత్రికనందు ప్రచురించిన ‘తోమాల, అర్చన సమయంలో సర్వదర్శనం’,‘రాత్రిపూట విఐపి దర్శనం రద్దు’, ‘తితిదే అధికారుల నిర్ణయం’ అనువార్త వాస్తవ దూరం.

శుక్రవారం తిరుమలలో జరిగిన సమీక్షా సమావేశంలో పలు అంశాలను అధికారులతో చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో సామాన్య భక్తులకు ఏ మేరకు సౌకర్యాలను పెంచవచ్చునో అధికారులతో సమాలోచించడం జరిగింది. ఇందుకు సంబంధించి త్వరలో జరుగనున్న పాలకమండలి సమావేశమునకు ప్రతిపాదనలు సమర్పించడం జరుగుతుంది. అంతేగానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు.

కనుక ఈ సమాచారాన్ని రేపటి మీ దినపత్రికనందు వివరణగా ప్రచురించాల్సిందిగా కోరడమైనది.

ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు