TTD JEO (E&H) INSPECTS TTD ASSETS AT VIZAG _ విశాఖలో టిటిడి ఆస్తులను పరిశీలించిన జెఈవో(విద్య మరియు ఆరోగ్యం) శ్రీమతి సదా భార్గవి
Tirupati, 24 March 2022: TTDJEO (E&H) Smt Sada Bhargavi on Thursday inspected the TTD assets in and around the port city of Visakhapatnam.
TTD JEO along with officials went around the Kalyana Mandapam, Engineering office, and Rest house at Muvvalavani Palem. She also inspected the 1.78 acres of land allotted for the Shravanam project at Vepagunta in Pendurthi Mandal and 1.04 acres of land donated to TTD at Kapparada near Madhurawada as well.
Later on, she visited the open terrace at the Sai complex of Dwaraka Nagar near the RTC bus stand and TTD Choultries of Simhachala temple.
After examining the status of assets the TTD JEO directed concerned officials to take suitable steps to maintain them.
Visakhapatnam task force Tashildar Sri Gauri Shankar Rao, TTD engineering officials were also present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
విశాఖలో టిటిడి ఆస్తులను పరిశీలించిన జెఈవో(విద్య మరియు ఆరోగ్యం) శ్రీమతి సదా భార్గవి
తిరుపతి, 2022 మార్చి 24: విశాఖ, పరిసర ప్రాంతాల్లో గల టిటిడి ఆస్తులను గురువారం జెఈవో(విద్య మరియు ఆరోగ్యం) శ్రీమతి సదా భార్గవి పరిశీలించారు.
ఎమ్‌విపి(మువ్వలవాని పాలెం) వద్ద గల టిటిడి కళ్యాణ మండపం, ఇంజినీరింగ్ కార్యాలయం, అతిధి భవనాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. పెందుర్తి మండలం వేపగుంట వద్ద శ్రవణం ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించిన 1.78 ఎకరాల భూమిని, విశాఖ మధురవాడ సమీపంలోని కప్పరాడలో టిటిడికి విరాళంగా బహుకరించిన 1.04 ఎకరాల భూమిని పరిశీలించారు.
అనంతరం విశాఖ ఆర్‌టిసి బస్టాండ్ సమీపంలోని ద్వారక నగర్ సాయి కాంప్లెక్స్‌లో విరాళంగా అందిన ఒపెన్ టెరస్‌ను, తరువాత సింహాచలం దేవస్థానం అధీనంలోని టిటిడి చౌల్ట్రీని జెఈవో పరిశీలించారు
ఆయా ఆస్తుల వద్ద ప్రస్తుత పరిస్థితిని గమనించి నిర్వహణ మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జెఈఓ వెంట విశాఖ టాస్క్ ఫోర్స్ తహశీల్దార్ శ్రీ గౌరిశంకర్ రావు, టిటిడి ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది