విశ్రాంత ప్రధాన అర్చకుడి మృతి పట్ల టీటీడీ చైర్మన్ సంతాపం
విశ్రాంత ప్రధాన అర్చకుడి మృతి పట్ల టీటీడీ చైర్మన్ సంతాపం
తిరుమల 3 ఏప్రిల్ 2021: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ విశ్రాంత ప్రధాన అర్చకులు శ్రీ నారాయణ దీక్షితులు మృతి పట్ల టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు.
శ్రీ నారాయణ దీక్షితులు మరణ వార్త తనకు ఆవేదన కలిగించిందని చెప్పారు. దశాబ్దాలపాటు ఆయన శ్రీవారి సేవలో తరించారని చైర్మన్ కొనియాడారు. శ్రీ దీక్షితులు ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారు నిబ్బరం ప్రసాదించాలని కోరారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది