విశ్వనాథ  విమర్శల్లో తాత్వికత : ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి

విశ్వనాథ  విమర్శల్లో తాత్వికత : ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి

తిరుపతి, జనవరి 04, 2013: శ్రీ విశ్వనాథ సత్యనారాయణ విమర్శల్లో తాత్వికత గోచరిస్తుందని హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు, పురాణ ఇతిహాస ప్రాజెక్టు, విశ్వనాథ సాహితీ పీఠం సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ”భారతీయ సాంస్కృతిక పరిరక్షణ – విశ్వనాథ సాహిత్యం” జాతీయ సదస్సు శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది.
 
మధ్యాహ్నం విశ్వనాథ విమర్శ అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. ఆయన ప్రసంగిస్తూ విశ్వనాథ సత్యనారాయణ రచించిన విమర్శన గ్రంథాలను పరిశీలిస్తే భౌతిక సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం మిన్న అనే విషయం అవగతమవుతుందని తెలిపారు. ఆకలిగా ఉన్నవారికి ఆకలి తీర్చడమే భారతీయ సంస్కృతి అని, ఇది ప్రపంచశాంతిని కోరుకుంటుందని వివరించారు.
 
అనంతరం హైదరాబాదుకు చెందిన శ్రీమతి అరుణావ్యాస్‌ ”విమర్శకుడిగా విశ్వనాథ” అనే అంశంపై, తిరుపతికి చెందిన డాక్టర్‌ గల్లా చలపతి ”శాకుంతల అభిజ్ఞానత” అనే అంశంపై, తిరుపతికి చెందిన ఆచార్య ఎం.గోవిందస్వామినాయుడు ”ఒకడు నాచన సోమన” అనే అంశంపై ఉపన్యసించారు. తిరుపతికి చెందిన డాక్టర్‌ ఎం.ప్రభాకరరావు ”నన్నయగారి ప్రసన్న కథా కలితార్థయుక్తి” అనే అంశంపై, ఒంగోలుకు చెందిన శ్రీమతి ధాత్రీకుమారి ”అల్లసానిపెద్దన అల్లిక జిగిబిగి” అనే అంశంపై, తిరుపతికి చెందిన శ్రీ ఇ.జి.హేమంతకుమార్‌ ”ఎమెస్కో ప్రచురణలు-పీఠికలు” అనే అంశంపై ఉపన్యసించారు.
 
అలాగే హైదరాబాదుకు చెందిన డాక్టర్‌ బాబావలి రావు ”అవతారిక, బాలకాండ”, జిల్లేళ్లమూడికి చెందిన డాక్టర్‌ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ ”సుందరకాండ” అనే అంశాలపై ప్రసంగించారు.
 
ఉదయం జరిగిన సదస్సులో విశ్వనాథవారి చిన్ననవలలు అనే అంశంపై ప్రముఖులు పరిశోధన పత్రాలు సమర్పించారు. హైదరాబాదుకు చెందిన శ్రీ సి.ఎస్‌.రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వరంగల్‌కు చెందిన శ్రీ చీమకుర్తి శివరావు ”ప్రాగ్రూపాలు-విశ్వనాథ నవలలు”, తిరుపతికి చెందిన డాక్టర్‌ వేదపారాయణ ”చెలియలికట్ట-మైదానం”, తిరుపతికి చెందిన డాక్టర్‌ పి.సి.వెంకటేశ్వర్లు ”చిన్నకథలు”, తిరుపతికి చెందిన ఆచార్య కె.దామోదరనాయుడు ”మాబాబు నవల”, హైదరాబాదుకు చెందిన శ్రీ వై.కామేశ్వరి ”స్త్రీపాత్రలు” అనే అంశాలపై ప్రసంగించారు. కాగా శనివారం సాయంత్రం 4.00 గంటలకు జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమం జరుగనుంది.
 
ఈ కార్యక్రమంలో ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్‌ మేడసాని మోహన్‌, కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.వాణి తదితరులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.