SRIVARI VAIKUNTA DARSHAN FOR BPL FAMILIES OF SC/ST/BC AND FISHERMEN- TTD CHAIRMAN _ వెనుకబడిన వర్గాల వారికి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం : టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి
-TTD CHAIRMAN LAYS FOUNDATION FOR SRIVARI KMs AT KANIGIRI AND DARSI AT PRAKASAM DISTRICT
Tirupati,19, December 2021: TTD Chairman Sri YV Subba Reddy on Sunday laid foundation stones for construction of Srivari Kalyana Mandapams at Darsi and Kanigiri towns of Prakasam districts.
Speaking at public meetings organised on the occasion the TTD chairman said the Kalyana Mandapam at Darsi town built over 1.5 acres at a cost of Rs1.5 crores will facilitate weddings with a guest list of 630 guests complete with Wedding Mandapam, dining hall and accommodation for the bride and bridegroom. At Kanigiri town also the Kalyana Mandapam will have all facilities on one care land at a cost of Rs 2 crore.
He said in directions of Honourable AP CM TTD has taken up Sanatana Hindu dharma campaign in a big way during last 2-1/2 years. And now all BPL families belonging to SC/ST/BC and fishermen communities were being provided free Srivari Darshan.
Similarly, as per the recent TTD board resolution free Srivari Darshan was provided to these categories at the rate of 1000 per day during the last Srivari Brahmotsavam in October last.
He said as per the board decision from January 13 onwards during the 10 days long Srivari Vaikunta Darshan also these categories of devotees will also be provided Vaikunta darshan.
All these initiatives of TTD was aimed at containing the spread of Religious conversations in villages of AP. In the same spirit, TTD was constructing SV temples in the SC/ST/BC and fishermen villages in a big way.
The chairman also highlighted the recent TTD initiatives lie Gudiko Gomata Gosamrakshana Goshalas and Gobases organic farming etc. As of now Presentation of cow and calf has been completed in 100 temples. And in the coming days’ action plans drawn for the expansion of the program to many more regions.
He said TTD is negotiating with corporate groups to promote an action plan for bringing all Goshalas in both Telugu states under one umbrella.
The TTD chairman also highlighted the progress of works h other kalyan Mandapam projects in Prakasam district like Nagulappulapadu, Markapuram, Medarmetta, etc.
The TTD chairman also said under the Srivani trust scheme Rs 3.6 crore was sanctioned for Sri Venkateswara at Adani, Rs 1.00 crore for Sri Kodandaramaswamy temple and Rs 2 crore for the Sri Prasanna Anjaneya Swamy temple at Singarakonda and assured adequate funds for the installation of Sri Thiyagaraya statue at Kakarla,
The TTD chairman also announced that in a phased, annex Srivari temples would be constructed at all TTD Kalyan Mandapams at a cost of Rs 5 lakhs.
Local MLA and TTD board member B Madhusudhan Yadav, MLA Sri Venugopal, Zilla Parishad chairperson Smt Buxhepalli Vankayalapati and ZP chairman Sri Abdul Gafoor were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వెనుకబడిన వర్గాల వారికి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం : టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి
ప్రకాశం జిల్లా కనిగిరి, దర్శిలో కల్యాణమండపాలకు శంకుస్థాపన
తిరుపతి, 2021 డిసెంబరు 19: టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఆదివారం ప్రకాశం జిల్లాలోని కనిగిరి, దర్శి ప్రాంతాల్లో నిర్మించనున్న టిటిడి కల్యాణమండపాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో ఛైర్మన్ మాట్లాడారు. దర్శిలో ఎకరన్నర భూమిలో కోటిన్నర రూపాయల ఖర్చుతో నిర్మించే ఈ కళ్యాణ మండపం లో 630 మంది అతిథులతో పెళ్ళి చేసుకోవడానికి అనుగుణంగా పెళ్ళి మండపం, డైనింగ్ హాల్, వధూవరుల వసతి గదులు ఇతర సదుపాయాలన్నీ ఉంటాయన్నారు. కనిగిరిలో ఎకరం భూమిలో 2 కోట్ల రూపాయలతో కల్యాణ మండపం నిర్మిస్తామని, ఇక్కడ 630 మంది అతిథులతో పెళ్ళి చేసుకోవడానికి అనుగుణంగా పెళ్ళి మండపం, డైనింగ్ హాల్, వధూవరుల వసతి గదులు ఉంటాయని తెలిపారు.
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు గత రెండున్నరేళ్లుగా టీటీడీ పెద్ద ఎత్తున హిందూధర్మ ప్రచారం చేస్తోందన్నారు.
వెనుక బడిన ప్రాంతాలు, ఎస్సీ, ఎస్టి, బిసి, మత్స్య కార గ్రామాల్లోని పేద ప్రజలకు ఉచితంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయిస్తున్నామని చెప్పారు.
టీటీడీ బోర్డు నిర్ణయం మేరకు బ్రహ్మోత్సవాల సందర్భంగా రోజుకు వెయ్యి మందికి చొప్పున ఎస్సీ, ఎస్టి, బిసి, మత్స్య కార గ్రామాల పేదలకు ఉచితంగా స్వామివారి దర్శనం చేయించామని చైర్మన్ వివరించారు.
అదే విధంగా జనవరి 13 వ తేదీ నుంచి 10 రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనం కూడా వీరికి ఉచితంగా చేయించాలని బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు.
మత మార్పిడులు అరికట్టడానికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు.
ఎస్సీ, ఎస్టి,బిసి, మత్స్య కార గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఆలయాలు నిర్మిస్తున్నామన్నారు.
గుడికో గోమాత కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా ప్రతి ముఖ్య ఆలయంలో భక్తులు గోపూజ చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు..
గోమాత, దూడ పోషణ చూసుకోవడానికి ముందుకొచ్చే ఆలయాలకు ఉచితంగా గోవు,దూడ అందిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 100 ఆలయాలకు గోవు, దూడలు ఉచితంగా అందించామనీ, రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు..
గో సంరక్షణ కోసం అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఇందులో భాగంగానే గో ఆధారిత వ్యవసాయం ప్రోత్సహించడానికి టీటీడీ అనేక చర్యలు తీసుకుంటోందన్నారు.
ఇలాంటి రైతులకు ఉచితంగా ఆవు, ఎద్దులు అందిస్తున్నామని ఆయన చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లోని గో శాలలను ఒక గొడుగు కిందకు తెచ్చి వాటికి అవసరమైన సహాయం అందించే ప్రణాళికలు తయారు అవుతున్నాయన్నారు. ఇందుకోసం కార్పొరేట్ సంస్థలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. భగవంతుడిని భక్తుల చెంతకు తెచ్చే విధంగా పెద్ద ఎత్తున శ్రీవారి కల్యాణాలు నిర్వహించనున్నామని చెప్పారు.
నాగులుప్పలపాడులో కూడా కళ్యాణ మండపం మంజూరు చేయడం జరిగిందని, గ్రామ ప్రజలు భూమి తో పాటు వారి కాంట్రిబ్యూషన్ అందిస్తే నిర్మాణం కోసం టీటీడీ అధికారులు టెండర్లు పిలుస్తారని చెప్పారు. మార్కాపురంలో 55 సెంట్ల భూమిలో రూ.99.80 లక్షలతో మొదటి ఫ్లోర్ లో 200 మందితోను, రెండవ ఫ్లోర్ లో 400 మంది అతిథులతో పెళ్ళి చేసుకునే విధంగా కళ్యాణ మండపం నిర్మించి గతయేడాది డిసెంబరు 6వ తేదీ ప్రారంభించామన్నారు. అలాగే సింగరకొండలో 99 సెంట్ల భూమిలో 120 మంది అతిథులతో పెళ్ళి చేసుకోవడానికి అనుకూలంగా రూ.58 లక్షలతో నిర్మించిన కళ్యాణ మండపం కూడా అదే రోజు ప్రారంభించామన్నారు.
ఒక కోటి 50 లక్షలతో మేదర మెట్లలో కల్యాణ మండపం నిర్మాణానికి కూడా గత సంవత్సరం డిసెంబరు 6 వతేదీ శంఖుస్థాపన చేయడం జరిగిందని, పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇక్కడ 630 మంది అతిథులతో పెళ్ళి చేసుకోవడానికి సకల సదుపాయాలు కల్పించబోతున్నామన్నారు.ఎర్రగొండ పాలెంలో ఎకర 40 సెంట్లల్లో కోటి 30 లక్షల రూపాయల ఖర్చుతో కళ్యాణ మండపం నిర్మాణానికి కూడా అదే రోజు శంఖుస్థాపన చేశామని, ఇక్కడ 455 మంది అతిథులతో అన్ని సదుపాయాలతో పెళ్ళి చేసుకునే ఏర్పాట్లు చేయడం జరుగుతుందని వివరించారు.
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అద్దంకి లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి 3.60 కోట్లు మంజూరు చేశామన్నారు. మోటుపల్లి లో కోటి రూపాయలతో శ్రీ కోదండ రామ స్వామి ఆలయ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశామన్నారు. సింగర కొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం రాజగోపురం నిర్మాణానికి 2 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. కాకర్ల లో శ్రీ త్యాగరాజస్వామి వారి విగ్రహం ఏర్పాటుకు అవసరమైన నిధులు అందించామన్నారు.
జిల్లాలోని అన్ని కళ్యాణ మండపాల ఆవరణంలో రూ 5 లక్షల వ్యయం తో శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని, దశల వారీగా ఈ ఆలయాల నిర్మాణం పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీ వేణుగోపాల్, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ, మున్సిపల్ చైర్మన్ శ్రీ షేక్ అబ్దుల్ గఫార్ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.