MANDALABHISHEKAM HELD _ వేడుకగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మండలాభిషేకం
Tirupati, 30 June 2023: The Mandalabhishekam ritual in the ancient temple of Sri Lakshmi Narasimha Swamy located in Sri Kapilathirtham was observed on Friday.
Deputy EO Sri Devender Babu and others were present.
వేడుకగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మండలాభిషేకం
తిరుపతి, 2023 జూన్ 30: తిరుపతిలోని కపిలతీర్థం ప్రాంగణంలో గల శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ మండలాభిషేకం శుక్రవారం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, యజమాని సంకల్పం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ట, మహాశాంతి, కుంభావాహన, కుంభారాధన, మహాశాంతి హోమంతోపాటు మూలవర్లకు అభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈవో శ్రీ కె.సుబ్బరాజు, కంకణభట్టార్ శ్రీ గోవిందాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.