VEDAS ARE THE ULTIMATE DHARMA-PONTIFF _ వేదమే పరమధర్మం: శ్రీశ్రీశ్రీ పరమహంస సచ్చిదానంద సరస్వతి స్వామి
Tiruchanoor, 27 Nov. 19: Veda is ultimate dharma, says pontiff Sri Sri Sri Paramahamsa Satchidananda Saraswati Swami, Pontiff of Tapivana, Tuni, East Godavari.
Speaking on the occasion of Srinivasa Veda Vidwat Sadas held at Asthana Mandapam on Wednesday as a part of the ongoing annual Karthika Brahmotsavams at Tiruchanoor, he said that Vedas are the basis and fundamental roots of all Dharmic rituals and practices.
The pontiff said vedas were not scripted for a few but for upliftment of mankind in the universe. The only route for bliss, moksha is to worship the almighty sincerely. He lauded the TTD for its commitment towards propagation of sanatana Hindu dharma.
Dr Akella Vibhishana Sharma, Project officer for SV Higher Vedic Studies presided over the event.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
వేదమే పరమధర్మం : శ్రీశ్రీశ్రీ పరమహంస సచ్చిదానంద సరస్వతి స్వామి
తిరుపతి, 2019 నవంబరు 27: వేదోక్తంగా ఆచరించే కర్మలన్నీ ధర్మబద్ధమైనవి, శాస్త్రీయమైననని, ధర్మానికి మూలం వేదాలేనని తూర్పుగోదావరి జిల్లా, తునిలోని తపోవనానికి చెందిన శ్రీశ్రీశ్రీ పరమహంస సచ్చిదానంద సరస్వతి స్వామి ఉద్ఘాటించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టిటిడి ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ఉదయం 6 నుండి 7.30 గంటల వరకు శ్రీనివాస వేద విద్వత్ సదస్సులో భాగంగా ప్రముఖ స్వామీజీల అనుగ్రహ భాషణం నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా బుధవారం శ్రీశ్రీశ్రీ పరమహంస సచ్చిదానంద సరస్వతి స్వామి “వేదం – విశ్వశ్రేయస్సు” అనే అంశంపై అనుగ్రహ భాషణం చేశారు. వేదం కొందరు వ్యక్తుల కోసం ఉద్దేశించింది కాదని, ఇది విశ్వమానవ శ్రేయస్సుకు ఉపకరిస్తుందని అన్నారు. ధర్మార్థకామాలను చక్కగా నిర్వర్తిస్తే చిత్తశుద్ధి కలుగుతుందని, హృదయంలో మాలిన్యాలను తొలగించుకుని భగవంతుని ఆరాధిస్తే మోక్షం కలుగుతుందని వివరించారు. సనాతన ధర్మప్రచారానికి కేంద్ర స్థానం తిరుమల తిరుపతి దేవస్థానములని, సకలజన శ్రేయస్సు కోసం వేదాలను పరిరక్షించి, ప్రచారం చేస్తోందని కొనియాడారు. అంతకుముందు వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఈ సందర్భంగా స్వామీజీని శాలువ, శ్రీవారి ప్రసాదంతో సత్కరించారు.
ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వేదపండితులు, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.