KODANDA RAMALAYAM GEARS UP FOR VAIKUNTA EKADASI _ వైకుంఠ ఏకాదశికి శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం ముస్తాబు

TIRUPATI, 25 DECEMBER 2022: The temple authorities of Sri Kodanda Ramalayam in Tirupati are gearing up for Vaikunta Dwara Darshanam for Vaikunta Ekadasi and Dwadasi on January 2 and 3 respectively. 

On January 2 and on January 3, the darshan commences from 1:30am onwards till 10pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వైకుంఠ ఏకాదశికి శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం ముస్తాబు

తిరుపతి, 2022 డిసెంబరు 25: జనవరి 2, 3వ తేదీలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం ఆలయంలో టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది.

శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 నుండి 12.45 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. 12.45 నుండి 1.30 గంటల వరకు మూలవర్లకు తోమాల, కొలువు తదితర సేవలను నిర్వహిస్తారు.

తెల్లవారుజామున 1.30 నుండి రాత్రి 10 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

చలువపందిళ్లు, బారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.