SUB-TEMPLES OF TTD DECK UP FOR V-DAY _ వైకుంఠ ఏకాదశి-ద్వాదశి వేడుకలకు సన్నద్ధమైన తితిదే ఉపదేవాలయాలు

TIRUMALA, DECEMBER 16:  All the TTD run sub shrines located in and around the temple city of Tirupati have been geared up to celebrate the auspicious days of Vaikuntha Ekadasi and Dwadasi on Friday and Saturday respectively.

 

The temple management has made elaborate arrangements for the sake of visiting pilgrims in the sub-temples of Sri Kodanda Ramaswamy and Govinda Raja Swamy in Tirupati, Sri Padmavathi temple at Tiruchanoor, Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta, Sri Kalyana Venakteswara Swamy temple at Srinivasa Mangapuram, Sri Venugopala Swamy temple at Karvetinagaram, Sri Vedanarayana Swamy temple at Nagalapuram and Sri Kalyana Venkateswara Swamy temple at Narayanavanam.

 

The HDPP and Annamacharya Project wings of TTD will be organising cultural programme to entertain the devotees with devotional programmes like Harikatha Parayanam and Annamaiah songs in praise of Lord Venkateswara.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైకుంఠ ఏకాదశి-ద్వాదశి వేడుకలకు సన్నద్ధమైన తితిదే ఉపదేవాలయాలు

తిరుపతి,2010 డిశెంబర్‌-16: తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో నడుస్తున్న అనేక ఉపదేవాలయాలు కూడా ఈనెల 17, 18వ తారీఖులలో జరుగనున్న వైకుంఠ ఏకాదశి-ద్వాదశి వేడుకలకు సన్నద్ధమైనాయి.

సాధారణంగా వైష్ణవ క్షేత్రాలన్నీ వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ఘనంగా ముస్తాబు అవుతాయి. తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఎంత ఘనంగా ఏకాదశి ఏర్పాట్లు జరుగుతున్నాయో అదేవిధంగా తిరుపతి, పరిసరప్రాంతాలలో వెలసియున్న తితిదే ఉప ఆలయాల్లో కూడా వైభవంగా ఈ పర్వదినం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అందులో భాగంగా స్వామివారి హృదయేశ్వరి అయిన తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో, అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో, నారాయణవనంలోని శ్రీ కళ్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో, తిరుపతిలోని శ్రీకకోదండరామస్వామి ఆలయంలో, శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో, శ్రీభక్తఆంజనేయస్వామి వారి ఆలయంలో, మంగాపురంలోని శ్రీ కళ్యాణవేంకటేశ్వరస్వామి ఆలయాలలో వైకుంఠ ఏకాదశిని అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా తితిదే అనేక సాంస్కుృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినది. ఇందులో భాగంగా హిందూధర్మప్రచారపరిషత్‌ కళాకారులతో హరికథాపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తనావిభావరి వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసినది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.