వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరం సందర్భంగా ప్రథమచికిత్సా కేంద్రాలు
వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరం సందర్భంగా ప్రథమచికిత్సా కేంద్రాలు
తిరుపతి, డిశెంబర్-23, 2009: వైకుంఠ ఏకాదశి మరియు నూతన సంవత్సరం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో వుంచుకొని ప్రత్యేక ప్రథమచికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తితిదే ప్రత్యేక వైధ్యాధికారిని డాక్టర్ శారద ఒక ప్రకటనలో తెలియజేశారు. డిశెంబర్ 27వ తేది నుండి జనవరి 2వ తేది వరకు ప్రథమ చికిత్సా కేంద్రాలు వుంటాయని చెప్పారు. శ్రీవారి ఆలయం ప్రక్కన, ప్రధాన కళ్యాణకట్ట మరియు కాలినడకదారిలోని 7వ మైలు తదితర ప్రాంతాలలో ఈ ప్రథమచికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆమె చెప్పారు.
అదేవిధంగా తిరుమల అశ్వనీ ఆసుపత్రినందు ఎమర్జెన్సీసెల్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసారు. భక్తులు ఏలాంటి ఆనారోగ్యానికి గురైనా వెంటనే పైన తెలిపిన ప్రథమచికిత్సా కేంద్రాలలో సంప్రదించి తగిన చికిత్స పొందవలసిందిగా కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.