ALL SET FOR SRIVARI SAHASRA DEPOTSAVAM AT VISAKHAPATNAM _ వైజాగ్‌లో శ్రీ‌వారి కార్తీక స‌హ‌స్ర దీపోత్స‌వానికి విస్తృత ఏర్పాట్లు

Tirupati, 10 Dec. 20: TTD has made elaborate arrangements for conducting Srivari Karthika Sahasra Deepotsavam at the M G M grounds of Ramakrishna Beach Road at Visakhapatnam on Friday, December 11.

As per COVID-19 guidelines, as many as 800 women devotees observing social distancing would light the traditional Karthika Deepam.

The TTD engineering department has put up barricades and colourfully decorated the dais on the ground with flowers and electrical lighting.

As part of the program in the evening Veda Swasti, Sankeertana Ganam, Punyahavachanam, Agni Pratistha, Sri Sukta Homam, Sri Lakshmi Chaturvimshati Namavali will be performed.

Thereafter Ashtalakshmi stotra Kuchipudi dance, Deeparadhana, Samuhika Deepa Nirajanam and Govinda Nama recitation, Nakastra Harati, Kumbha Harati and Karpoora Harati will also be rendered during this fete.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైజాగ్‌లో శ్రీ‌వారి కార్తీక స‌హ‌స్ర దీపోత్స‌వానికి విస్తృత ఏర్పాట్లు
 
తిరుప‌తి‌, 2020, డిసెంబ‌రు 10: వైజాగ్ ఆర్‌కె బీచ్ రోడ్‌లోని ఎంజిఎం గ్రౌండ్స్‌లో డిసెంబ‌రు 11న శుక్ర‌వారం జ‌రుగ‌నున్న శ్రీ‌వారి కార్తీక స‌హ‌స్ర దీపోత్స‌వానికి టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టింది. 
 
కోవిడ్-19 నేప‌థ్యంలో భౌతిక‌దూరం పాటిస్తూ 800 మంది మ‌హిళ‌లు దీపాలు వెలిగించేలా ఏర్పాటుచేశారు. వేదిక‌ను శోభాయ‌మానంగా పుష్పాల‌తో, విద్యుత్ దీపాల‌తో అలంక‌రించారు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వ‌ర్యంలో మైదానంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.
 
సాయంత్రం 6 నుండి రాత్రి 8.15 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. ఇందులో భాగంగా వేద‌స్వ‌స్తి, సంకీర్త‌న గానం, పుణ్యాహ‌వ‌చ‌నం/అగ‌్నిప్ర‌తిష్ట‌, శ్రీ సూక్తహోమం, శ్రీ ల‌క్ష్మీ చ‌తుర్వింశ‌తి నామావ‌ళితో అర్చ‌న నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత అష్ట‌ల‌క్ష్మీ స్తోత్ర కూచిపూడి నృత్యం, దీపారాధ‌న‌, సామూహిక దీప‌నీరాజ‌నం, గోవింద‌నామాలు, న‌క్ష‌త్ర హార‌తి, కుంభ హార‌తి, క‌ర్పూర‌‌హార‌తి ఇస్తారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.