TTD JEO INSPECTION CUM REVIEW VONTIMITA BTU ARRANGEMENTS _ వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు

Vontimitta, 20 Mar. 21: TTD Joint Executive Officer, Smt Sada Bhargavi on Saturday made a spot inspection of preparations for the annual Brahmotsavams cum Sri Rana Navami Utsavam arrangements at Sri Kodandarama Swamy temple at Vontimitta in YSR Kadapa District from April 21 to 29.

Along with Rajampeta MLA and TTD board member Sri Meda Mallikarjun Reddy, she inspected the temple, Kalyana Vedika and instructed officials to make elaborate arrangements in coordination with district officials and local public representatives.

Later speaking to the media she said the AP Chief Minister Sri YS Jaganmohan Reddy is expected to participate in the Sita Rama Kalyanam on April 26 wherein a huge attendance of nearly two lakh devotees is being anticipated.

She said she had instructed the TTD officials to coordinate with district police to make foolproof arrangements for CM’s visit with elaborate parking, medical, ambulance and sanitation arrangements. The JEO said grand flower decoration will be done at Kalyana Vedika on the day of the celestial wedding and also at the temple during all nine days of Brahmotsavams with 15 tons of flower and fruits through donations.

Speaking on the occasion the MLA Sri Mallikarjun Reddy offered to donate flowers, fruits and make Annaprasadam arrangements for all devotees coming for the Vonntimitta Brahmotsavams.

SEs Sri Jagadeeswar Reddy, Sri Venkateswarlu, DyEO Sri Ramesh Babu, Estate Officer Sri Mallikarjuna, CMO Dr Narmada, Additional Health Officer Dr Sunil, Garden Superintendent Sri Srinivasulu, DFO Sri Chandrasekhar, AVSO Sri Giridhar and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు
 
 — విస్తృత ఏర్పాట్లు  చేయాలని అధికారులకు జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి ‌ఆదేశం
 
–   అధికారులతో సమీక్ష సమావేశం
 
ఒంటిమిట్ట, 2021 మార్చి 20: ఒంటిమిట్ట శ్రీకోదండరాముని శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 21 నుండి 29వ తేదీ వరకు వైభవంగా  నిర్వహించడానికి అధికారులు సమాయత్తం కావాలని జెఈవో  శ్రీమతి సదా భార్గవి చెప్పారు.
 
రాజంపేట శాసన సభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ మేడా మల్లిఖార్జున రెడ్డి తో కలసి శనివారం ఆమె ఆలయం, కళ్యాణ వేదిక పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
 
ఈ సందర్భంగా జెఈవో.మాట్లాడుతూ, రాష్ట్ర పండుగగా జరిపే శ్రీరామ నవమి వేడుకలకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని జెఈవో  అధికారులను ఆదేశించారు. 
   
టీటీడీ అధికారులు జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.  ఏప్రిల్ 26న శ్రీసీతారాముల కల్యాణోత్స‌వానికి దాదాపు రెండు లక్షల మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉందన్నారు.  శ్రీసీతారాముల కల్యాణానికి గౌ|| ముఖ్యమంత్రివర్యులు విచ్చేసే అవకాశం ఉండడంతో పోలీస్‌ అధికారులతో సమన్వయం చేసుకుని భద్రతాపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. వాహనాల పార్కింగ్‌కు  స్థలాలను గుర్తించి తగు చర్యలు చేపట్టాలని చెప్పారు.
 
కల్యాణం రోజున అన్నప్రసాదం పంపిణీ చేయాలని, తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలని, వైద్య బృందాలు, అంబులెన్స్‌ సిద్ధంగా వుంచుకోవాలని  సంబంధిత అధికారులకు సూచించారు. ఆలయం, పరిసర ప్రాంతాలలో పరిశుభ్రత, పారిశుద్ధ్యంకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
 
కళ్యాణ వేదిక వద్ద మైక్ సిస్టం ఎలాంటి ఇబ్బంది రాకూడదన్నారు. బ్రహ్మోత్సవాల 9 రోజులు ఆలయం,కళ్యాణ వేదిక వద్ద పుష్పఅలంకరణ అద్భుతంగా ఉండాలన్నారు. ఇందుకు అవసరమయ్యే 15 టన్నుల పువ్వులు, పండ్లు విరాళాల ద్వారా సేకరించే ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయం లోపల,బయట వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. కళ్యాణ వేదిక వద్ద స్థానిక అధికారులు, విజిలెన్స్ విభాగంతో సమన్వయం చేసుకుని బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు.
      
ఎమ్మెల్యే శ్రీ.మల్లిఖార్జున రెడ్డి.మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో ఎంతమందికైనా తాము అన్నదానం చేస్తామని చెప్పారు. పుష్పఅలంకరణకు అవసరమయ్యే పువ్వులు,పండ్లు విరాళంగా అందక పోతే తామే సమకూరుస్తామన్నారు. 
       
ఎస్ఈ లు శ్రీ జగదీశ్వర్ రెడ్డి,  శ్రీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ వెంకటేశ్వర్లు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నర్మద, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్, డిఎఫ్ ఓ శ్రీ చంద్రశేఖర్, ఏవి ఎస్వో శ్రీ గిరిధర్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.