ANNUAL FLOAT FESTIVAL IN SRI KODANDARAMA SWAMY TEMPLE CONCLUDES _ వైభవంగా ముగిసిన శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు
Tirupati, 26 April 2013: On the concluding day of ongoing three day Annual Float Festival in Sri Kodanda Rama Swamy, the processional deity of Lord Rama, Seetha and Lakshmana were taken out in procession from Sri Vari Temple to Ramachandra Pushkarni situated near the Temple on Friday evening. Later, the deities were mounted on the colourfully illuminated Float, and were dragged around the holy tank amidst great religious fervour from 7PM to 8PM.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
వైభవంగా ముగిసిన శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు
తిరుపతి, ఏప్రిల్ 26, 2013: తిరుపతిలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ కోదండరామస్వామివారి తెప్పోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రకాలతో అభిషేకం చేశారు.
అనంతరం సాయంత్రం 6.00 గంటలకు సీతారామలక్ష్మణులు ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు. విద్యుద్దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవారు ఆశీనులై పుష్కరిణిలో తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కర్పూర నీరాజనాలు సమర్పించారు. తెప్పోత్సవం అనంతరం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు.
ఆకట్టుకుంటున్న రామాయణం ప్రదర్శన
తెప్పోత్సవాల సందర్భంగా రామచంద్ర పుష్కరిణి వద్దగల వేదికపై రామాయణంలోని వివిధ ఘట్టాలతో ఏర్పాటుచేసిన ఎల్‌ఇడి బోర్డుల ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంటోంది. శ్రీరాముని పట్టాభిషేకం, రావణాసుర సంహారం, సీతను లంక నుండి తీసుకురావడం, లాంటి ఘట్టాలు ప్రదర్శనాంశాలుగా ఉన్నాయి. అదేవిధంగా తితిదే విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో వివిధ పురాణాంశాలతో ఏర్పాటుచేసిన విద్యుత్ కటౌట్లు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ప్రసాదమూర్తిరాజు, ఆలయ సూపరింటెండెంట్ శ్రీ సురేష్‌రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శేషారెడ్డి, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.