TEPPOTSAVAMS CONCLUDES _ వైభవంగా ముగిసిన శ్రీ కోదండరామ స్వామివారి తెప్పోత్సవాలు
TIRUPATI, 05 APRIL 2023: The annual Teppotsavams in Sri Kodandarama temple in Tirupati concluded on a grand note on Wednesday.
On the last day Sita Lakshmana sameta Sri Ramachandra Swamy took nine rounds on the sacred waters of Sri Ramachandra Pushkarini.
Deputy EO Smt Nagaratna and other staffs, devotees participated.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా ముగిసిన శ్రీ కోదండరామ స్వామివారి తెప్పోత్సవాలు
తిరుపతి, 2023 ఏప్రిల్ 05: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి తెప్పోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 6.30 గంటలకు శ్రీసీతారామలక్ష్మణులు ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో 9 చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ మోహన్, సూపరింటెండెంట్ శ్రీ రమేష్ కుమార్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.